Virat Kohli: వారం రోజుల్లోనే టీమిండియాకు మరో బిగ్ షాక్

Google News Follow Us

సారాంశం

Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు ఈ విషయం తెలియజేశాడు. గత వారం రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీంకి మరో షాక్ తగిలింది. వారం రోజుల్లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారం తర్వాత విరాట్ కోహ్లీ కూడా రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. వచ్చే నెల ఇంగ్లాండ్ టూర్‌లో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న టీం ఇండియాకి విరాట్ నిర్ణయం ఊహించనిది. దీంతో బీసీసీఐ, సెలక్షన్ కమిటీకి కొత్త సమస్య వచ్చిపడింది.

 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గత కొన్ని సంవత్సరాలుగా భారత్ కు అనేక విజయాలు అందించారు. గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో వీరి రిటైర్మెంట్ వార్తాలు వినిపిస్తూ వచ్చాయి. గత సంవత్సరం T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో విఫలమైన తర్వాత రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు విరాట్ కూడా టెస్టులకు దూరం అవుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు. 
 

Read more Articles on