
వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజ్ నుంచి టీమిండియా ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ రద్దు కావడం... టీమిండియా ప్లేఆఫ్స్ అవకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపింది...
ఐసీసీ టోర్నీలో భారత జట్టుకి భంగపాటు ఎదురుకావడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. వుమెన్స్ వరల్డ్ కప్ 2017, వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020తో పాటు వన్డే వరల్డ్ కప్ 2019, పురుషుల టీ20 వరల్డ్ కప్ 2021, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకి పరాభవమే ఎదురైంది...
వీటిలో పురుషుల జట్టు ఐసీసీ టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, భారత మహిళా జట్టు పోరాట ప్రటిమకు హ్యాట్సాఫ్ చెబుతూ ట్వీట్ చేశాడు. ‘మన మహిళా జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నా, వాళ్లు చివరిదాకా పోరాడిన విధానం అద్భుతం. మీ శక్తిమేర మీరు ప్రయత్నించారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...
సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఖరిదాకా పోరాడి చేతులు ఎత్తేసింది భారత మహిళా జట్టు. దీంతో 9 పాయింట్లతో సౌతాఫ్రికా, 7 పాయింట్లతో వెస్టిండీస్ ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లగా భారత జట్టు 6 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది...
సఫారీ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మృతి మంధాన 84 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు చేయగా షెఫాలీ వర్మ 46 బంతుల్లో 8 ఫోర్లతో 53 పరుగులు చేసి అవుటైంది...
కెప్టెన్ మిథాలీ రాజ్ 84 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేయగా హర్మన్‌ప్రీత్ కౌర్ 57 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేసింది... లీజెల్లీ 6 పరుగులు చేసి అవుట్ కాగా లోరా వాల్వరెట్, లారా గుడ్‌విల్ కలిసి రెండో వికెట్‌కి 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ ఇద్దరూ అవుటైన తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా సాగింది. చివరి ఓవర్‌లో విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో దీప్తి శర్మ బౌలింగ్‌కి వచ్చింది. తొలి బంతికి సింగిల్ రాగా, రెండో బంతికి చెట్టీ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యింది.
మూడో బంతికి సింగిల్ రాగా, నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఆఖరి విజయానికి 2 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన దశలో దీప్తి శర్మ బౌలింగ్‌లో డు ప్రీత్ భారీ షాాట్‌కి ప్రయత్నించి, క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది.
అయితే టీవీ రిప్లైలో ఆ బంతి నో బాల్‌గా తేలడంతో అదనంగా ఓ పరుగు సౌతాఫ్రికా ఖాతాలో చేరింది... విజయానికి ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి రాగా... సింగిల్స్ తీసి మ్యాచ్‌ను ముగించారు సఫారీ బ్యాటర్లు.