ఔట్ అయిన కోపంలో విరాట్ కోహ్లీ ఆవేశం .. రిఫరీ మందలింపు

By telugu news teamFirst Published Apr 15, 2021, 9:50 AM IST
Highlights

ఆవేశంలో ఐపీఎల్ రూల్స్ ని ఉల్లంఘించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 29 బంతుల్లో 33 పరుగులు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 12.1 వ బంతిని భారీ షాట్ ఆడాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నిన్నటి మ్యాచ్ లో తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. దీంతో... ఆయనను రిఫరీ మందలించాల్సి వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆఖరి విజయం ఆర్సీబీ కే దక్కింది  కానీ.. ఆ మధ్యలో..  ఓ విషయంలో కోహ్లీ తీవ్ర ఆవేశానికి గురికావడం గమనార్హం.

ఆవేశంలో ఐపీఎల్ రూల్స్ ని ఉల్లంఘించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 29 బంతుల్లో 33 పరుగులు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్ వేసిన 12.1 వ బంతిని భారీ షాట్ ఆడాడు. అయితే.. ఆ బంతిని లాంగ్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ విజయ్ శంకర్ క్యాచ్ పట్టడంతో.. కోహ్లీ ఔట్ అయ్యాడు. 

ఔట్ అయిన కోహ్లీ ఆవేశలో డగౌట్ చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను అడ్వర్టైజ్మెంట్ కుషన్, కుర్చీని తన్నేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ నియమావళిలో ని లెవల్ 1 రూల్ ని ఉల్లంఘించాడనే అభియోగాలు నమోదయ్యాయి. దీంతో రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ కోహ్లీని మందలించాడు.

కాగా.. 2016 లో ఇదే బెంగూరుతో మ్యాచులో గౌతమ్ గంభీర్ కూడా ఇలానే చేశాడు. అప్పుడు ఆయనకు ఫీజులో 15శాతం కోత విధించారు. కాగా.. నిన్నటి మ్యాచ్ లో ఆర్సీబీ చాలా తక్కువ స్కోర్ చేసినప్పటికీ.. విజయం ఆ జట్టుకే వరించింది. 

click me!