ఆధిపత్యానికి బ్రేక్... విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజమ్

By telugu news teamFirst Published Apr 15, 2021, 8:51 AM IST
Highlights

అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ.. బాబర్ రాకతో.. రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా.. పాకిస్తాన్ నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ గా బాబర్ అజామ్ నిలిచాడు. 
 

కొద్ది రోజుల వరకు ఐసీసీ నెంబర్ వన్ క్రికెటర్ ఎవరు అనగానే అందరూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఆ స్థానానికి బ్రేక్ పడింది. కోహ్లీ స్థానాన్ని బాబర్ అజామ్ బర్తీ చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 

అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లీ.. బాబర్ రాకతో.. రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా.. పాకిస్తాన్ నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ గా బాబర్ అజామ్ నిలిచాడు. 

సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చివరి గేమ్‌లో 82 బంతుల్లో 94 పరుగులు చేసిన 26 ఏళ్ల  ఈ రైట్ హ్యాండ్ ఆటగాడు 13 రేటింగ్ పాయింట్లు సాధించి 865 పాయింట్లను చేరుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ కంటే.. బాబర్ 8 పాయింట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 825 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 2017 అక్టోబర్ నుంచి 2021 ఏప్రిల్ మధ్యలో 1258 రోజుల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ బ్యాటుతో రాణించాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో బ్యాట్స్‌మాన్‌గా నిలిచాడు. మొత్తం 228 పరుగులు చేసిన బాబర్.. ఒక వన్డేలో సెంచరీ (103) కూడా నమోదు చేశాడు. దీంతో బాబర్‌కు భారీగా రేటింగ్ పాయింట్లు లభించాయి.

పాకిస్తాన్ తరపున 2010, 2012 అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన బాబర్.. 2015లో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్న బాబర్.. సమకాలీన క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి అసలైన పోటీ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. పాక్ తరపున గతంలో జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో అగ్రస్థానినికి చేరుకున్నారు.

వారి తర్వాత ఆ ఘనత సాధించిన పాక్ క్రికెటర్ బాబర్ అజమ్. టీ20 ర్యాంకింగ్‌లో గతంలో అగ్రస్థానంలో ఉన్న బాబర్.. ప్రస్తుతం 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించిన మరో పాక్ బ్యాట్స్‌మాన్ ఫకర్ జమాన్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు ప్రస్తుతం 7వ ర్యాంకులో ఉన్నాడు.

click me!