ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్... స్టార్ పేసర్‌కి కరోనా పాజిటివ్...

Published : Apr 14, 2021, 08:40 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్... స్టార్ పేసర్‌కి కరోనా పాజిటివ్...

సారాంశం

పాక్‌తో సిరీస్ మధ్యలోనే ఇండియాకి వచ్చిన సౌతాఫ్రికా బౌలర్లు నోకియా, రబాడా... కరోనా పరీక్షల్లో నోకియాకి పాజిటివ్... రెండు మ్యాచులకు దూరమయ్యే ఛాన్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌ మొదలై ఐదు మ్యాచులు పూర్తయినా... ఇంకా కరోనా భయం వీడడం లేదు. తాజాగా మరో ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. పాక్‌తో సిరీస్ కారణంగా ఆలస్యంగా ఇండియాకి చేరుకున్న సౌతాఫ్రికా పేసర్ అన్రీచ్ నోకియా కరోనా బారిన పడ్డాడు.

గత సీజన్‌లో రబాడాతో పాటు అద్భుతంగా రాణించిన నోకియా, ఢిల్లీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు... కొన్నిరోజుల క్రితం ఇండియాకి చేరుకున్న రబాడా, నోకియా ప్రస్తుతం క్వారంటైన్‌లో గడుపుతున్నారు. రబాడాకి చేసిన కరోనా పరీక్షలో నెగిటివ్ రాగా, నోకియా కరోనా పాజిటివ్ వచ్చింది.

దీంతో అతను మరో 10 రోజుల పాటు ఐసోలేషన్, క్వారంటైన్‌లో గడపబోతున్నాడు. గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన రబాడా మాత్రం వచ్చే మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది...మొదటి మ్యాచ్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, రేపు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. 

PREV
click me!

Recommended Stories

IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !
Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!