ఐసీసీ ప్రతిపాదనను ఒప్పుకునే సవాలే లేదు...తేల్చి చెప్పిన కోహ్లీ

By telugu team  |  First Published Jan 4, 2020, 6:52 PM IST

తాజాగా ఐసీసీ, టెస్టు క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఉద్దేశించిన ఒక నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు భారత స్కిప్పర్ విరాట్ కోహ్లీ. ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే ఐసీసీ ప్రతిపాదనను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యతిరేకించాడు. 


గత కొన్ని రోజులుగా టెస్టు మ్యాచులకు పూర్వ వైభవం ఎలా తీసుకురావాలనేదానిపై ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పింక్ బాల్ టెస్టు మ్యాచులు, టెస్ట్ క్రికెట్ ప్రపంచ కప్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా ఐసీసీ, టెస్టు క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఉద్దేశించిన ఒక నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు భారత స్కిప్పర్ విరాట్ కోహ్లీ. ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే ఐసీసీ ప్రతిపాదనను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యతిరేకించాడు. 

Latest Videos

undefined

Also read; శ్రీలంక తో టి20 సిరీస్:ధావన్ వర్సెస్ రోహిత్... ఓపెనర్ల సమరానికి రంగం సిద్ధం

టెస్టు మ్యాచును ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలను కోవడం సరైన ఆలోచన కాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా ఎప్పుట్నుంచో టెస్టుల్లో ఐదు రోజుల ఆట కొనసాగుతుందని, దాన్ని అలాగే కొనసాగించాలని కోహ్లీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.  

ఏదో మార్పు చేస్తే టెస్టుకు మంచి రోజులొస్తాయనే ఆలోచనతో... ఐదు రోజుల ఆటను నాలుగు రోజులకు కుదించడం ఆమోదయోగ్యం కాదని విరాట్ పేర్కొన్నాడు. ఒకవేళ టెస్టు క్రికెట్‌ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఏవైనా మార్పులు చేయాలనుకుంటే డే అండ్‌ నైట్‌ టెస్టుకు సంబంధించి ఆ దిశగా ఆలోచన చేయాలని భారత స్కిప్పర్ వ్యాఖ్యానించాడు. 

డే అండ్‌ నైట్‌ టెస్టులో ఏమైనా నూతన మార్పులు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా టెస్టు క్రికెట్ ను మార్చడానికి యత్నిస్తే బాగుంటుందన్నాడు. డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచులకు అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 

సంప్రదాయ టెస్టు క్రికెట్‌ లో ఇలా ఒక రోజు ఆటను తగ్గించి నాలుగు రోజులకు కుదించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నాడు. ఇప్పుడు మనం నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుడితే, మరికొన్ని రోజులకు మూడు రోజుల టెస్టు క్రికెట్‌ను ప్రవేశ పెడితే బాగుంటుందనే వాదన కూడా తెరపైకి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నాడు. 

Also read: రోహిత్ శర్మకు విశ్రాంతి: ఇక ఆ రికార్డు విరాట్ కోహ్లీ సొంతం

నాలుగు రోజులకు టెస్టు క్రికెట్ ను కుదించాలన్న ఐసీసీ ఆలోచనను ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్లంతా తప్పుబడుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ  ఏమో ముందు అసలు ఐసీసీ ప్రపోసల్ చూసి తరువాత స్పందిస్తానని అన్నాడు. 

ఈ నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ప్రతిపాదనను ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సైతం వ్యతిరేకించాడు. నాలుగు రోజుల టెస్టు క్రికెట్‌ అనేది సరైన నిర్ణయం కాదని   గ్లెన్‌ మెక్‌గ్రాత్‌అభిప్రాయపడ్డాడు.

click me!