సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ..!

By telugu news team  |  First Published Oct 9, 2023, 10:13 AM IST

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల తేడా లక్ష్యంతో బరిలోకి దిగింది.  ఈ మ్యాచ్ లో  కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి టీమ్ ని విజయ తీరాలకు చేర్చారు.


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టీమిండియా ఘన విజయంతో మొదలెట్టింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వీరోచిత పోరాటంతో ఆదుకున్నారు.వీరి కారణంగానే వరల్డ్ కప్ లో మొదటి విజయం అందుకుంది. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఏకంగా క్రికెట్ దిగ్గజం, సచిన్ టెండుల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు. 

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 200 పరుగుల తేడా లక్ష్యంతో బరిలోకి దిగింది.  ఈ మ్యాచ్ లో  కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి టీమ్ ని విజయ తీరాలకు చేర్చారు. 116 బంతులకు 85 పరుగులు చేశాడు. మొత్తం 92 మ్యాచుల్లో 5, 517 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు పరుగులు 88.98 కావడం విశేషం. గతంలో  సచిన్ టెండుల్కర్  124 మ్యాచుల్లో5490 పరుగులు చేశాడు. కానీ, కోహ్లీ మాత్రం 92 మ్యాచుల్లోనే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

Latest Videos

విరాట్ కోహ్లీ 2205 పరుగులు చేస్తే, ఇంతకుముందు కుమార సంగర్కర 2193 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో 2719 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ ఆ రికార్డును అధిగమించేశాడు.

click me!