ICC World cup 2023: కోహ్లీ, రాహుల్ వీరోచిత పోరాటం.. ఆసీస్‌పై ఘన విజయంతో వరల్డ్ కప్ మొదలెట్టిన టీమిండియా..

Published : Oct 08, 2023, 09:56 PM IST
ICC World cup 2023: కోహ్లీ, రాహుల్ వీరోచిత పోరాటం.. ఆసీస్‌పై ఘన విజయంతో వరల్డ్ కప్ మొదలెట్టిన టీమిండియా..

సారాంశం

85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... 97 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించిన కెఎల్ రాహుల్.. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని ఓడించిన టీమిండియా..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టీమిండియా ఘన విజయంతో మొదలెట్టింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వీరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 165 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు..

116 బంతుల్లో 6 ఫోర్లతో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే టీమిండియా విజయానికి 12.2 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితికి చేరుకుంది.. కెఎల్ రాహుల్ 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు..

హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా, ఘన విజయంతో ప్రపంచ కప్‌ని మొదలెట్టింది. 

వన్డేల్లో మూడో స్థానంలో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్, వన్డేల్లో 12,662 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. నాన్‌-ఓపెనర్‌గా ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ 2205 పరుగులు చేస్తే, ఇంతకుముందు కుమార సంగర్కర 2193 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో 2719 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ ఆ రికార్డును అధిగమించేశాడు.. 

అంతకుముందు 200 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన  టీమిండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఆడిన రోహిత్ శర్మ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు..

శ్రేయాస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హజల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సమయానికి 2 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా, 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. టీమిండియా చేసిన 2 పరుగులు కూడా ఎక్స్‌ట్రాల రూపంలోనే రావడం విశేషం. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 49.3 ఓవర్లలో 199 పరుగులకి ఆలౌట్ అయ్యింది..  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?