బీసీసీఐ అవార్డ్స్ లో కోహ్లీ బ్రైట్ స్మైల్... ఫోటోలు వైరల్

By telugu teamFirst Published Jan 13, 2020, 2:24 PM IST
Highlights

ఆ ఫోటోని ఇండియన్ క్రికెట్ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటో పోస్టు చేసింది.  ఆఫోటోకి ‘ షైన్ లైక్ ద స్కిప్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోలో కోహ్లీ పక్కన టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఈ ఫోటో కోహ్లీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో... విపరీతంగా షేర్ చేస్తున్నారు.
 

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)  2018-2019 సీజన్ కు గాను అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం ముంబయిలో  ఈ వేడుకకు విజేతల తో పాటు  బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ , టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే  పలువురు భారత మాజీ క్రికెటర్లు హాజరైయ్యారు. 

అయితే... ఈ వేడుకులకు సంబంధించి విరాట్ కోహ్లీ ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కార్యక్రమానికి వచ్చిన అతిథులను, క్రికెటర్లను ఫోటోలు తీస్తూ ఉంటారు.. ఇది చాలా కామన్ విషయం. అలా ఫోటో తీస్తున్న ఫోటో గ్రాఫర్ కి కోహ్లీ ఓ మంచి ఫోజు ఇచ్చాడు. బ్రైట్ స్మైల్ ఇస్తూ ఫోటో దిగాడు. ఆ ఫోటోలో కళ్లు కొంచెం పెద్దవిగా చేసి.. చక్కగా నవ్వాడు. 

ఆ ఫోటోని ఇండియన్ క్రికెట్ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటో పోస్టు చేసింది.  ఆఫోటోకి ‘ షైన్ లైక్ ద స్కిప్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోలో కోహ్లీ పక్కన టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఈ ఫోటో కోహ్లీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో... విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Also Read ఇషాంత్ శర్మ స్టైలిష్ పోస్ట్... ట్రోల్ చేసిన విరాట్ కోహ్లీ...

ఇదిలా ఉంటే టీమిండియా యువఫాస్ట్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా ,ఉత్తమ అంతర్జాతీయ  క్రికెటర్ అవార్డు కు ఎంపిక కావడం తో అతన్ని బీసీసీఐ, పాలీ ఉమ్రిగర్ పురస్కారంతో సన్మానించింది.  మహిళా క్రికెటర్ల లో పూనమ్ యాదవ్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా ఎంపికయ్యింది.  

వీరితోపాటు  ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర ఆటగాడిగా  మయాంక్ అగర్వాల్ ఎంపిక కాగా మహిళా క్రికెట్ లో షఫాలీ వెర్మ ఈ అవార్డు దక్కించుకుంది. శివమ్ దూబే ను  ఉత్తమ  రంజీ ఆల్ రౌండర్ అవార్డు వరించగా  భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి  శ్రీకాంత్  ను  కోల్ సీకే నాయుడు  జీవిత కాల పురస్కారంతో సత్కరించారు. ఆయనతో  పాటు భారత  మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా ను కూడా  ఈ ప్రతిష్టాత్మక  అవార్డు అందించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shine like the Skip! 🌟🌟 Hey There 👋🏻👋🏻 #NAMAN

A post shared by Team India (@indiancricketteam) on Jan 12, 2020 at 6:35am PST

 

click me!