
Virat Kohli special gift to Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 204) లో భాగంగా జరిగిన 10 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ బెంగళూరుపై శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా టీమ్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా మరో గెలుపును సొంతం చేసుకుంది. బెంగళూరు ఓడినప్పటికీ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అయితే, విరాట్ కోహ్లి తన జూనియర్ ఆటగాళ్లను ఎంతబాగా నడుచుకుంటాడో అందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో బ్యాట్‌తో పరుగులు వరద పారించడమే కాదు తోటి ప్లేయర్ల హృదయాలను గెలుచుకోవడం కూడా తెలుసు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ తర్వాత భారత్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ విరాట్ కోహ్లీని కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇవి వైరల్ గా మారాయి. కోహ్లీ తనకు ఇష్టమైన విలువైన వస్తువును రింకూకి బహుమతిగా ఇచ్చాడు. తన డ్రెస్సింగ్ రూమ్ వీడియోను ఆర్సీబీ షేర్ చేసింది, అందులో కోహ్లీ తన బ్యాట్‌ను రింకూ సింగ్‌కు బహుమతిగా ఇచ్చాడు. రింకూ సింగ్ దానిని అందుకున్న తర్వాత చాలా సంతోషంతో కోహ్లీని కౌగిలించుకున్నాడు.
రింకూ సింగ్ భారత జట్టుకు, కేకేఆర్ కు ఫినిషర్‌గా అవతరించిన తర్వాత ప్రశంసలకు గుర్తుగా కోహ్లీ ఈ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అలాగే, ఆర్సీబీ-కేకేఆర్ ప్లేయర్లు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నట్లు కూడా వీడియోలో కనిపించింది. ఇది మరువకముందే మైదానంలో మరో ఆహ్లాదకరమైన సంఘటన కనిపించింది. ఉప్పునిప్పులా కనిపించే గంభీర్-కోహ్లీలు కరచాలనం చేసి కౌగిలించుకున్నారు. ఇద్దరి మధ్య నవ్వులతో కూడిన చిరు సంభాషణ కూడా కనిపించింది. ఈ దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి.
ఇదేనా మీ బుద్ది.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. కాంగ్రెస్ నాయకుడిపై సైనా నెహ్వాల్ ఫైర్