IPL 2024: శ్రేయాస్ అయ్యర్‌తో మిస్టరీ గర్ల్.. ఎవ‌రీ త్రిషా కులకర్ణి? ఫొటోలు వైర‌ల్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 30, 2024, 4:08 PM IST

Shreyas Iyer's Girlfriend : టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడిన రెండు మ్యాచ్ ల‌లో కూడా కేకేఆర్ విజ‌యంతో ముందుకు సాగ‌తోంది. అయితే శ్రేయాస్ అయ్యర్ ఒక మిస్టరీ గర్ల్ తో నిత్యం కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  
 


Shreyas Iyer : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ ప్రారంభ‌మైన మొద‌టి వారంలో క్రికెట్ ల‌వ‌ర్స్ కు అద్భుమైన ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కి నాయకత్వం వ‌హిస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివ‌ర‌కు ఆడిన త‌న టీమ్ కు రెండు మ్యాచ్ ల‌లో విజ‌యాన్ని అందించాడు. టైటిల్ గెల‌వ‌డమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, శ్రేయాస్ అయ్య‌ర్ కు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫొటోలు వైర‌ల్ గా మారాయి. ఎందుకంటే అత‌ని ప‌క్క‌న ఒక అమ్మాయితో ఉన్నాడు. దీంతో ఎవ‌రీ మిస్ట‌రీ గ‌ర్ల్ అంటూ ఫ్యాన్స్ ఆమె గురించి వెతికేస్తున్నారు. ఆమె త్రిష కుల‌క‌ర్ణి.

భారత జట్టులోని కీలక ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకరు. అత‌ను త‌న ఫ్యాన్స్ తో సోష‌ల్ మీడియాలో ట‌చ్ లో ఉంటూ త‌న‌కు సంబంధించిన ఫొటోలు, ఇత‌ర వివ‌రాల‌ను పంచుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు ఒక అమ్మాయితో క‌నిపించిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిని రేకెత్తించాయి. శ్రేయాస్ త్రిష కులకర్ణితో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, శ్రేయాస్ అయ్యర్ తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప‌లు పార్టీలలో అతనితో తరచుగా కనిపించే మిస్టరీ గర్ల్‌తో అతను డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వ్యాపించాయి. 

Latest Videos

RCB VS KKR : అప్పుడు తిట్టుకున్నారు.. కొట్టుకునే దాకా వెళ్లారు.. ఇప్పుడు కౌగిలింతలు..

ఆ మిస్ట‌రీ గర్ల్ త్రిష కులకర్ణితో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె ప‌లు పార్టీలు, రెస్టారెంట్లలో శ్రేయాస్ తో కనిపించారు. అయ్య‌ర్ ఆట చూడటానికి 2023 వ‌న్డే ప్రపంచ కప్‌కు హాజరయ్యాయని కూడా ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొన్నాయి. అయితే, వారిద్దరూ తమ బంధం గురించి ఏమీ ధృవీకరించలేదు. మీడియా కథనాల ప్రకారం అయ్యర్ త్రిష కులకర్ణితో డేటింగ్ చేస్తున్నాడు. టీమ్ ఇండియా దీపావళి వేడుకలో కలిసి కనిపించిన తర్వాత వారి సంబంధం గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. శ్రేయాస్ అయ్యర్, త్రిష తరచుగా బహిరంగంగా కలిసి క‌నిపిస్తున్నారు. శ్రేయస్‌తో పాటు, అతని సోదరి శ్రేష్ట అయ్యర్ కూడా త్రిషను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు. అయితే, త్రిష ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రైవేట్‌గా ఉంది.

చాహ‌ల్ స్పిన్ మాయ‌.. కోపంతో రిగిలిపోయిన రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

click me!