బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్: నరైన్ మన్కడింగ్‌కు కోహ్లీ రియాక్షన్ ఇదే (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 20, 2019, 12:18 PM IST
Highlights

విరాట్ కోహ్లీ... క్రీజులో అత్యంత చురుగ్గా కదులుతూ పరుగులు రాబట్టడంలో దిట్ట. ప్రత్యర్థి జట్టు  బౌలర్లకు చిక్కకుండా అత్యంత చాకచక్యంగా బంతిని  బాదడంలో కోహ్లీ టెక్నిక్ అద్భుతం. ముఖ్యంగా ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత చక్కగా ఫీల్డింగ్ చేసినా తనను రనౌట్ చేసే అవకాశమే ఇవ్వడు. సహచర ఆటగాళ్ల తప్పిదం వల్ల  అతడు రనౌటైన సందర్భాలున్నాయే తప్ప కోహ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన సందర్భాలు చాలా అరుదు. అలా ఎప్పుడూ జాగ్రత్తగా ఆచి తూచి క్రీజులో కదిలే కోహ్లీ ఎంత చురుగ్గా వుంటాడో మరోసారి రుజువయ్యింది. 

శుక్రవారం ఐపిఎల్ లీగ్ దశలో భాగంగా బెంగళూరు, కోల్ కతా జట్లు తలపడ్డాయి. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకోవాలంటే ప్రతి మ్యాచ్ ను గెలిచి తీరాల్సి  వుండటంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కసితో బ్యాటింగ్ చేశాడు. చివరివరకు బ్యాటింగ్ చేపట్టి జట్టుకు భారీ స్కోరు అందిచాలన్న తాపత్రయం కోహ్లీ బ్యాటింగ్ లో కనిపించింది. ఈ క్రమంలోనే మన్కడింగ్ కు గురయ్యే ప్రమాదం నుండి అతడు చాకచక్యంగా తప్పించుకుని  బౌలర్ ను ఆటపట్టించి మైదానంలో నవ్వులు పూయించాడు. 

కోల్ కతా బౌలర్ సునీల్ నరైన్ వేసిన 18వ ఓవర్లో స్టోయినీస్ బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ నాస్ స్ట్రైకర్ ఎండ్ లో వున్నాడు. ఈ  సమయంలో నరైన్ చివరి బంతి వేయడానికి  పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా బంతి వేయకుండా ఆగిపోయాడు. అయితే అప్పటికే క్రీజులోంచి కాస్త బయటకు వచ్చిన కోహ్లీ మన్కడింగ్ కు పాల్పడతాడేమోనన్న  అనుమానంతో బ్యాటును క్రీజులోపెట్టాడు. ఆ తర్వాత కోహ్లీ నరైన్ ను సరదాగా ఆటపట్టించాడు. ఈ  సరదా సన్నివేశం ఆటగాళ్లనే కాదు అభిమానులను ఆకట్టుకుంది. 

మొత్తానికి  ఈ మ్యాచ్ లో బెంగళూరు మరో అద్భుత విజయాన్ని అందుకుంది.  కోహ్లీ వీరోచిన సెంచరీతో రాయల్ చాలెంజర్స్‌  214 పరుగుల భారీ టార్గెట్‌ను కోల్ కతా ముందు వుచింది. దీన్ని చేధించే క్రమంలో కోల్ కతా చతికిలపడింది. నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసిన పోరాడినప్పటికి కోల్ కతా విజయాన్ని అందుకోలేకపోయింది.  

click me!