సార్ డబ్బులివ్వమన్నారు:ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో కేటుగాళ్ల వసూలు

Siva Kodati |  
Published : Apr 20, 2019, 11:17 AM IST
సార్ డబ్బులివ్వమన్నారు:ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరుతో కేటుగాళ్ల వసూలు

సారాంశం

టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైబర్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ప్రసాద్‌ పేరు చెప్పి డబ్బులు ఇవ్వాలంటూ ఆగంతకులు పలువురిని వేధిస్తున్నారు. 

టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైబర్ వేధింపులను ఎదుర్కొంటున్నారు. ప్రసాద్‌ పేరు చెప్పి డబ్బులు ఇవ్వాలంటూ ఆగంతకులు పలువురిని వేధిస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెస్కే ప్రసాద్ లెటర్ ప్యాడ్‌ను సంపాదించిన దుండగులు... ఆయన డబ్బులు ఇవ్వమన్నారంటూ పలువురికి ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన పేరిట ఫోన్ కాల్స్, నకిలీ లెటర్స్ సృష్టించి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్