విలియమన్స్ ను హేళన చేసిన కోహ్లీ: జర్నలిస్టుపై విరుచుకుపడ్డ కెప్టెన్

By telugu team  |  First Published Mar 2, 2020, 10:51 AM IST

విరాట్ కోహ్లీ సంయమనాన్ని కోల్పోయి జర్నలిస్టుపై విరుచుకుపడ్డాడు. విలియమ్సన్ ను హేళన చేసిన సంఘటనపై ప్రశ్నించిన జర్నలిస్టుపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కివీస్ పై ఓటమి తర్వాత మీడియా సమావేశంలో ఆ సంఘటన జరిగింది.


క్రైస్ట్ చర్చ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ జర్నలిస్టుతో వాగ్యివాదానికి దిగాడు. న్యూజిలాండ్ పై రెండో టెస్టు ఓటమి తర్వాత ఆయన జర్నలిస్టుపై విరుచుకుపడ్డాడు. విలియమ్సన్ ను హేళన చేస్తూ దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై జర్నలిస్టు కోహ్లీని ప్రశ్నించాడు. అంతే, విరాట్ కోహ్లీ అతనిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. 

రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు అవుటైన తర్వాత పెవిలియన్ కు తిరిగి వెళ్తుండగా విలియమ్సన్ ను విరాట్ కోహ్లీ హేళన చేశాడు. ఆ సంఘటన కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Latest Videos

undefined

Also Read: కివీస్ తో రెండో టెస్టు మ్యాచ్: పాత కోహ్లీ తిరిగొచ్చాడు, నోటి దురుసు

విలియమ్సన్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ తన వేలిని పెదవులపై ఉంచి, చప్పుడు చేయవద్దంటూ ప్రేక్షకులకు సైగ చేశాడు. జర్నలిస్టు దాని గురించే విరాట్ కోహ్లీని అడిగాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో ఏం జరిగిందనే విషయం తెలియకుండా ప్రశ్నలు వేయవద్దని విరాట్ కోహ్లీ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"విరాట్, విలియమ్సన్ వైపు, ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ హేళన చేసిన సంఘటనపై మీ రియాక్షన్ ఏమిటి? భారత కెప్టెన్ గా మీరు మైదానంలో ఆదర్శంగా ఉండాలని అనుకోలేదా?" అని జర్నలిస్టు అడిగాడు.

విరాట్ కోహ్లీ: నువ్వేమనుకుంటున్నావు?

జర్నలిస్టు: నేను మీకు ప్రశ్న వేశాను.

విరాట్ కోహ్లీ: నేను నిన్ను సమాధానం అడుగుతున్నాను

జర్నలిస్టు: మీరు ఆదర్శంగా ఉండాలి

Also Read: రెండో టెస్టు మ్యాచ్: సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్, కోహ్లీ సేన ఇంటి ముఖం

విరాట్ కోహ్లీ: మైదానంలో ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవడం అవసరం ఆ తర్వాత ప్రశ్న వేయి. ఏం జరిగిందనే విషయంపై సగం ప్రశ్నలతో, సగం వివరాలతో ఇక్కడికి రావద్దు. నువ్వు వివాదం సృష్టించదలుచుకుంటే ఇది సరైన స్థలం కాదు. నేను మ్యాచ్ రెఫరీతో మాట్లాడా. జరిగినదానిపై సమస్యేమీ లేదన్నాడు. థాంక్యూ యూ.

విరాట్ కోహ్లీ సంయమనాన్ని కోల్పోయి మాట్లాడడం కొత్తేమీ కాదు. 2018 సెప్టెంబర్ లో ఇంగ్లాండుపై టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

click me!