వరుస కాంట్రవర్సీలు: మరో వివాదంలో స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య

By telugu teamFirst Published Mar 2, 2020, 10:48 AM IST
Highlights

ఇప్పటికే గతంలో కాఫీ విత్ కారం షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల టీంకి దూరమై చాలా కాలం వేటు తరువాత తిరిగి టీంలోకి వచ్చాడు. ఆ తరువాత కొద్దీ కాలానికే శస్త్ర చికిత్స పుణ్యమాని టీం కి ఇంకా దూరంగానే ఉన్నాడు.

భారత స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు, వివాదాలకు మధ్య ఏదో బలమైన అనుబంధం ఉందా అనే అనుమానం.... తాజాగా జరిగిన మరో సంఘటనను చూస్తే మనకు అనుమానం తప్పక వస్తుంది. ఈ యువ అల్ రౌండర్ దేశవాళీ డీవై పాటిల్ టోర్నమెంటులో ఆడుతుండగా ఈ కొత్త వివాదం హార్దిక్ పాండ్యను చుట్టుముట్టింది. 

ఈ దేశవాళీ టోర్నీలో రిలయన్స్1 తరుఫున ఆడుతున్న హార్దిక్ పాండ్య ధరించిన హెల్మెట్ ఇప్పుడు ఈ కొత్త వివాదానికి కారణమయింది. ఇప్పటికే గతంలో కాఫీ విత్ కారం షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల టీంకి దూరమై చాలా కాలం వేటు తరువాత తిరిగి టీంలోకి వచ్చాడు. 

ఆ తరువాత కొద్దీ కాలానికే శస్త్ర చికిత్స పుణ్యమాని టీం కి ఇంకా దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం ముగిసిన న్యూజీలాండ్  సిరీస్ కి కూడా ఫిట్నెస్ సాధించలేకపోవడం వల్లే దూరమయ్యాడు హార్దిక పాండ్య. ఇలా ఇప్పుడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయిన కం బ్యాక్ మ్యాచ్ లోనే ఇలా వివాదం చెలరేగడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. 

ఈ మ్యాచులో హార్దిక్ నాలుగు సిక్సర్లతో, బౌలింగ్ లో మూడు వికెట్లతో తాను ఎంతటి అల్ రౌండర్ నో నిరూపించుకునే ప్రయత్నం చేసినప్పటికీ... ఈ తాజా వివాదం అతని హీరోయిక్స్ ను పూర్తిగా కనుమరుగు చేసాయి. వివరాల్లోకి వెళితే... హార్దిక్ ఇలా దేశవాళీ టోర్నీలో రిలయన్స్1 తరుఫున ఆడుతూ భారత దేశ పతాకం, బీసీసీఐ లోగో ఉన్న హెల్మెట్ ను ధరించాడు. 

వాస్తవానికి ఏ క్రికెటర్ అయినా కూడా ఇలా దేశం తరుఫున కాకుండా వేరే ఏ మ్యాచుల్లో ఆడినా సరే హెల్మెట్లపై ఇలా భారతీయ పతాకాన్ని ధరించకూడదు. ఒకవేళ హెల్మెట్లపై ఇలా పతాకాలు గనుక ఉంటె... అవి కనబడకుండా టేప్ వేయాల్సి ఉంటుంది. 2014లో బీసీసీఐ ఈ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. 

ఇలా ఆటగాళ్లెవరైనా ఈ లోగోను ధరించారు లేదా అని చూడమని రెఫరీలను బీసీసీఐ ఆదేశించింది. ఇలా గనుక ఎవరైనా క్రికెటర్ ధరిస్తే... అది బీసీసీఐ నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇప్పటికే వివాదాలతో ప్రేమాయణం నడుపుతున్న హార్దిక్ ఇప్పుడు తాజాగా వివాదాలను పెండ్లి చేసుకున్నాడంటూ కామెంట్లు వినబడుతున్నాయి. 

click me!