రెండో టెస్టు మ్యాచ్: సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్, కోహ్లీ సేన ఇంటి ముఖం

By telugu teamFirst Published Mar 2, 2020, 7:43 AM IST
Highlights

భారత్ పై న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు మ్యాచును న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పరాజయాల పరంపరతో కోహ్లీ సేన వెనుదిరిగింది.

క్రైస్ట్ చర్చ్: భారత్ పై రెండు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు మ్యాచును 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. వన్డేల సిరీస్ ను, ఆ తర్వాత టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన పరాజయాల పరంపరను మూట గట్టుకుని ఇంటి ముఖం పట్టేందుకు రెడీ అయింది. రెండో టెస్టు మ్యాచులో కివీస్ విజయానికి 132 పరుగులు అవసరం కాగా మూడు వికెట్లను కోల్పోయి లాంఛనాన్ని పూర్తి చేసింది.

టామ్ లాథమ్ (52), బ్లండెల్ (55) అర్థ సెంచరీలు చేయగా, కేన్ విలియమ్సన్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత టైలర్ (5), నికోల్స్ (5) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

భారత్ పై విజయానికి 132 పరుగులు అవసరం కావాల్సిన స్థితిలో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్సులో 107 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.  టామ్ లాథమ్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగులో అవుటయ్యాడు.

విజయానికి 132 పరుగుల అవసరమై ఉండగా, లంచ్ విరామ సమయానికి న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, బ్లండెల్ 46 పరుగుల స్కోరు చేసి క్రీజులో ఉన్నారు. అయితే, ఆ తర్వాత ఇరువురు కూడా అర్థ సెంచరీలు చేసి అవుటయ్యారు. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్లండెల్ కు ఓ లైఫ్ దొరికింది. ఆ తర్వాత చెలరేగి అతను అర్థ సెంచరీ చేశాడు.

రెండో ఇన్నింగ్సులో భారత్ ఆరు పరుగుల నష్టానికి 90 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు సోమవారం బ్యాటింగ్ కు దిగింది. అ తర్వాత కేవలం 10 ఓవర్లు ఆడి 34 పరుగుల జోడించింది. మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే భారత్ హనుమ విహారి వికెట్ ను కోల్పోయింది.  ఆ తర్వాత ఐదు బంతులకు స్కోరు ఏ మాత్రం పెంచకుండా రిషబ్ పంత్ అవుటయ్యాడు. 

 95 పరుగుల వద్ద విహారి, పంత్ ఇద్దరూ అవుటయ్యారు. ఆ తర్వాత మొహమద్ షమీ (5), జస్ప్రీత్ బుమ్రా (4) రన్నవుటయ్యారు. రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు

click me!