అది చాలా ప్రమాదం.. బాల్ నా కోర్టులో లేదు.. కాఫీవిత్ కరణ్ షోపై హార్దిక్

By telugu teamFirst Published Jan 9, 2020, 1:13 PM IST
Highlights

అసలు ఇంటర్వ్యూ అనేది చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నాడు. ఆ సమయంలో బంతి తన కోర్టులో లేదంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా... ఓ మీడియా సంస్థతో ఆ ఇంటర్వ్యూ నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటాడు. ఇటీవల తన ప్రేయసి నటాశాకి జనవరి 1వ తేదీన ప్రపోజ్ చేసి... అందరి దృష్టి ఆకర్షించిన హార్దిక్ గతంలో చాలా వివాదాల్లో ఎక్కాడు. మరీ ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ షోలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి... అడ్డంగా బుక్కయ్యాడు. తన సహఆటగాడు కేఎల్ రాహుల్ తో కలిసి షోలో పాల్గొనగా.. ఇద్దరూ బుక్కయ్యారు. ఇద్దరినీ ఆ కామెంట్స్ కారణంగా సస్పెండ్ కూడా చేశారు. ఆ షో తర్వాత తనపై వచ్చిన విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు నానా తిప్పలు పడ్డాడు. తాజాగా... ఆ షో గురించి మరోసారి హార్దిక్ స్పందిచాడు.

అసలు ఇంటర్వ్యూ అనేది చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నాడు. ఆ సమయంలో బంతి తన కోర్టులో లేదంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా... ఓ మీడియా సంస్థతో ఆ ఇంటర్వ్యూ నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘‘ క్రికెటర్లుగా అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. బంతి మా కోర్టులో లేదు. అది వేరేవాళ్ల కోర్టులో ఉంది. అక్కడి నుంచి బాల్ ని వాళ్లే తన్నాలి. కానీ ఇంటర్వ్యూ అనేది మాత్రం చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఎవరూ అక్కడ ఉండాలని అనుకోరు.’’ అని హార్దిక్ పేర్కొన్నాడు.

AlsoReadటీ20 ప్రపంచ కప్ 2020: కోహ్లీ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఇతనే..

ఇదిలా ఉండగా... హార్దిక్ టీమిండియాలోకి రాకముందు  ఏడో స్థానంలో ధోనీ ఉండేవాడు. దీంతో... ధోనీతో పాండ్యాని పోల్చడంపై కూడా స్పందించాడు.

తానెప్పటికీ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేనని చెప్పాడు. తాను కనీసం పోలికల జోలికి కూడా వెళ్లనని చెప్పాడు. కానీ... ఛాలెంజ్స్ ఎదురుకోవడానికి మాత్రం తాను ఉత్సాహంగా ఉంటానని చెప్పాడు. తాను ఏం చేసినా జట్టుకోసమే చేస్తానని చెప్పారు. మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుకుంటూ పైకి వెళ్ాలని అప్పుడే ట్రోఫీ దక్కుతుందని  చెప్పాడు. 

ఇదిలా ఉండగా... పాండ్యా గత కొంతకాలంగా వెన్నుముక దిగువ భాగంలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో... ఇటీవల దానికి శస్త్రచికిత్స కూడా తీసుకున్నాడు. దాని నుంచి కోలుకునేంత వరకు విశ్రాంతిలోనే ఉంటాడు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ నొప్పి నుంచి కోలుకుంటున్నట్లు చెప్పాడు. 

click me!