కోహ్లీ, డివిలియర్స్ రన్నింగ్ రేస్.. ఇద్దరిని దాటేసిన దేవదూత్

By Siva KodatiFirst Published Mar 30, 2021, 6:49 PM IST
Highlights

 కోహ్లి, డివిలియర్స్‌, దేవ్‌దూత పడిక్కల్‌ మధ్య ట్విటర్‌ వేదికగా జరిగిన వీడియో చాటింగ్‌ నవ్వులు పూయిస్తుంది.

ఐపీఎల్‌లోని పెద్ద జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకటి. స్వయంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తుండటం, స్టార్ క్రికెటర్లతో నిండిన ఆ జట్టు ఎప్పుడూ హాట్ ఫేవరేటే. కానీ పేపర్ మీద బలంగా కనిపించే ఆర్సీబీ.. అసలు పోరాటంలో మాత్రం చేతులెత్తేస్తూ నిరాశతో ప్రతి ఐపీఎల్‌లోనూ నిష్క్రమిస్తోంది.

అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో మాత్రం ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్‌ వరకు వచ్చింది. అయితే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలై మళ్లీ ఒట్టి చేతులతో వెనుదిరిగింది.

అయితే ఈసారి ఆసీస్‌ విధ్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ రాకతో ఆర్‌సీబీ బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో  కోహ్లి, డివిలియర్స్‌, దేవ్‌దూత పడిక్కల్‌ మధ్య ట్విటర్‌ వేదికగా జరిగిన వీడియో చాటింగ్‌ నవ్వులు పూయిస్తుంది.

మొదట కోహ్లి తన ఇంట్లోని ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీసున్న వీడియోను షేర్‌ చేశాడు. ఇది చూసిన డివిలియర్స్‌ వావ్‌ కోహ్లి.. నీ కసరత్తు పరుగులు తీస్తుంది.. ఇంట్లో నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నావు..నేను కూడా అన్ని ప్యాక్‌ చేశా.. ఐపీఎల్‌ ఆడేందుకు వస్తున్నా అంటూ కామెంట్‌ చేశాడు.

దీనికి స్పందించిన కోహ్లి..'' ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా వికెట్ల మధ్య నువ్వు వేగంగా పరిగెత్తగలుగుతావు.. నేను నిన్ను అందుకోవాలి..'' అని అన్నాడు. దీనికి బదులిచ్చిన డివిలియర్స్‌.. అయితే మనిద్దరం రన్నింగ్‌ రేస్‌ పెట్టకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం'' అని తెలిపాడు.

ఈ రన్నింగ్‌ రేస్‌లో కోహ్లి, డివిలియర్స్‌ పోటీ పడి పరిగెత్తారు.. ఒకదశలో కోహ్లిని డివిలియర్స్‌ దాటేశాడు. ఇంతలో ఒక ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. కోహ్లి, డివిలియర్స్‌ను దాటుకుంటూ దేవదూత్‌ పడిక్కల్‌ వేగంగా పరిగెత్తుతూ చివరన ఉన్న లైన్‌ను టచ్‌ చేశాడు.

మీ ఇద్దరి కన్నా ముందు నేను ప్రాక్టీస్‌ ప్రారంభించా.. అందుకే ఇంత వేగంగా పరిగెత్తా .. అయినా సరే మీలాంటి సీనియర్‌ క్రికెటర్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా అంటూ దేవదూత్‌ అన్నాడు. అయితే వీరు ఎందుకు చేశారో తెలుసా.. పూమా క్రికెట్‌ ప్రమోషన్‌ కోసం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ 2021లో భాగంగా ఏప్రిల్‌ 9న జరగనున్న తొలి మ్యాచ్‌లో బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. 

click me!