
ఇంగ్లాండ్ తో ఇటీవల టీమిండియా వన్డే సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. కాగా.. ఈ సిరీస్ లో టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ తన ఆటతో విపరీతంగా ఆకట్టుకున్నాడు.
మూడు వన్డేలు కలిపి 7 వికెట్లతో టీమిండియా తరపున లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. అంతేగాక మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌లో 21 బంతుల్లో 30 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ 6 వికెట్లు తీసినా.. పొదుపు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ సంగతి పక్కన పెడితే.. మూడో వన్డేలో శార్దూల్ చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఓవర్‌లో శార్దూల్ వేసిన బంతి అతనిపై ఫన్నీ మీమ్స్ వచ్చేలా చేశాయి. బంతిని వేసే క్రమంలో శార్దూల్ అన్ని వేళ్లు కిందకు దించి.. కేవలం మధ్య వేలు పైకి చూపుతూ బంతిని విసిరాడు. సాధారణంగా మధ్య వేలు చూపిస్తే చాలామందిలో డబుల్ మీనింగ్ డైలాగులు బయటికి వస్తుంటాయి. ఇప్పుడు శార్దూల్‌ను ట్రోల్ చేయడానికి అతని వేలు కారణమైంది. అతనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వచ్చాయి.
''శార్దూల్.. ఆ వేలు ఎవరికి చూపిస్తున్నాడు.. నకల్ బాంతి లాగా శార్దూల్ ఫకల్ బంతిని కనిపెట్టాడు.. శార్దూల్ ఆ వేలిని తనను అసహ్యించుకునేవాళ్లకు చూపిస్తున్నాడు.. ఏంటి శార్దూల్ ఈ పని.. ఒక బ్యాట్స్‌మన్‌కు ఆ వేలు ఎలా చూపించగలవు..'' అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు