బుమ్రా, సంజనలకు అమూల్ స్వీట్ సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

By telugu news teamFirst Published Mar 17, 2021, 9:36 AM IST
Highlights

ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్.. ఈ నూతన వధూవరులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్ ప్రైజ్ చూసిన వారంతా వావ్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.

టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా... టీవీ ప్రజెంటర్ సంజన గణేషన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. వీరికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంగీత్ సమయంలో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ వేసిన వీడియో కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉందటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంటకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్.. ఈ నూతన వధూవరులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సర్ ప్రైజ్ చూసిన వారంతా వావ్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.

‘జాస్ కో ప్రీత్ మిల్ గయా’ అంటూ.. బుమ్రా, సంజనల క్యారికేచర్ ని అమూల్ షేర్ చేసింది. వీరి క్యారికేచర్ చాలా క్యూట్ గా ఉంది. ఇద్దరూ సముద్ర తీరం వద్ద కూర్చొని.. అమూల్ చీజ్ ని ఆస్వాదిస్తున్నారు. కాగా.. ఒక చేతితో అమూల్ చీజ్ తింటూనే.. మరో చేతిలో బుమ్రా బాల్.. సంజన మైక్ పట్టుకోవడం విశేషం.  ఆ క్యారికేచర్ లో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉండటం విశేషం.  అమూల్ ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయిందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.

 

ఇదిలా ఉండగా.. అమూల్ ఇటీవల ప్రిన్స్ హ్యారీ, మేఘన్ లోను ఓప్రా ఇంటర్వ్యూ చేయగా.. దానికి సంబంధించి కూడా ఇలాంటి క్యారికేచర్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. 

click me!