మాజీ క్రికెటర్ మృతి... సహచరుల సంతాపం

By Arun Kumar PFirst Published May 7, 2019, 4:40 PM IST
Highlights

వెస్టిండిస్ మాజీ  క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్ మెన్ గా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడిన సీమర్ నర్స్ (85) మృతిచెందారు. వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురైన అతడు గత కొంతకాలంగా ఆస్పత్రికే పరిమితమయ్యాడు. అయితే మంగళవారం అతడి  పరిస్థితి మరింత  విషమించి తుది శ్వాస విడిచినట్లు అతడి సహచరుడు, మాజీ క్రికెటర్ డెస్‌మండ్ హేన్స్ ప్రకటించారు. 

సీమర్ నర్స్ తో  తనకున్న  అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ హేన్స్ ఆవేదనతో కూడిన పోస్ట్ పేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ''  కోచ్, మెంటార్ గా నేనెంతో ప్రేమించిన వ్యక్తి (సీమర్‌ నర్స్‌) ఇక లేరు. కొన్ని రోజుల క్రితమే ఆయనతో కలిసి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్ ప్రదర్శనను గుర్తుచేసుకుని సంబరాలు చేసుకున్నాం. అయితే గతరాత్రి ఆయన కూతురు నుండి ఓ కాల్ వచ్చింది. తన తండ్రి మృతిచెందినట్లు ఆమె  చెప్పిన మాటలు నన్నెంతో బాధించాయి. మేమంతా  నర్స్ లాగ బ్యాటింగ్ చేయడానికే  కాదు ఆయన అడుగుజాడల్లో నడవడానికి, ఆయనలా ఇతరులతో ప్రేమగా మాట్లాడేందుకు ప్రయత్నించేవాళ్లం. నా కోసం మీరు(నర్స్) ఎంతో చేశారు. అందుకు కృతజ్ఞతలు. మీ  ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా'' అని హేన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. 

1960-1969 ప్రాంతంలో దాదాపు తొమ్మిదేళ్ల పాటు సీమర్ నర్స్ వెస్టిండిస్ జట్టుకు సేవలు అందించాడు. ఇతడు మొత్తం 29 టెస్టులాడి 47.6 స్ట్రైక్‌ రేట్‌తో 2523 పరుగులు చేశారు. ఇలా తన కెరీర్లో అతడు ఆరు శతకాలు, 10 అర్ధ శతకాలు బాదాడు. రిటైర్మెంట్ తర్వాత సీమర్స్‌ బార్బడోస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో కోచ్‌గా,  బార్బడోస్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.  

click me!