స్మృతి మంధాన మెరుపులు... ఉత్కంఠపోరులో ట్రయల్స్ బ్లేజర్స్ దే విజయం

By Arun Kumar PFirst Published May 7, 2019, 3:27 PM IST
Highlights

ఐపిఎల్... భారతీయ క్రికెట్ అభిమానులను సమ్మర్ లో అలరించడానికి బిసిసిఐ ఏర్పాటుచేసిన ఓ  మెగా క్రికెట్ లీగ్. విదేశీ, స్వదేశీ, రంజీ ఆటగాళ్ల ను భాగస్వామ్యం చేస్తూ బిసిసిఐ  చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ లీగ్ బిసిసిఐ తో పాటు ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపిస్తుండటమే కాదు ఆటగాళ్ళకు తమ సత్తా నిరూపించుకోడానికి ఓ ప్లాట్‌ఫారంగా  మారింది. ఈ క్రమంలోనే  బిసిసిఐ మరో ప్రయోగం చేసింది. మెన్స్ ఐపిఎల్ లీగ్ మాదిరిగానే  విమెన్స్ ఐపిఎల్ టీ20 ఛాలెంజ్ పేరుతో మహిళా క్రికెటర్లలో  ఓ లీగ్ కు రూపకల్పన  చేసింది. 

ఇందులో భాగంగా సోమవారం రాత్రి జైపూర్ వేధికగా మహిళా క్రికెట్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు  జరిగింది. స్మృతి మంధాన  కెప్టెన్సీలోని ట్రయల్స్  బ్లేజర్స్ , హర్మన్
ప్రీత్ సారథ్యంలోని సూపన్ నోవాస్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. చివరకు బ్లేజర్స్ జట్టు 2 పరుగుల తేడాతో గెలిచి సూపర్ నోవాస్ పై పైచేయి
సాధించింది. 

మొదట బ్యాటింగ్ చేసిన బ్లేజర్స్ జట్టులో సారథి  మంధాన చెలరేగి ఆడింది.  ఆమె కేవలం  67 బంతుల్లోనే 3 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో  90 పరుగులు చేసింది. అలాగే హార్లిస్ డియోల్  కూడా సమయోచితంగా బ్యాటింగ్ చేసి  36 పరుగులు 44 బంతుల్లో చేసింది. దీంతో బ్లేజర్స్  జట్టు నిర్ణీత ఓవర్లలో 140 పరుగులు చేసింది. 

141 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ నోవాస్ జట్టులో టాప్ ఆర్డర్ రాణించినా చివరి నిమిషంలో తడబడి ఓటమిపాలయ్యింది. కెప్టెన్  హర్మన్ ప్రీత్ (34 బంతుల్లో  46 పరుగులు) దాటిగా ఆడారు. ఆమెతో పాటు  సోఫీ డివైన్ (32 పరుగులు) చమరీ ఆటపట్టు(26 పరుగులు), రోడ్రిగ్స్ (24పరుగులు) రాణించడంతో సూపర్ నోవాస్ విజయంవైపు అడుగులేసింది. 

అయితే చివరి ఓవర్లో గెలపుకోసం 19 పరుగులు అవసరమవగా హర్మన్ అద్భుతం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ ఓవర్లో 16 పరుగులు మాత్రమే రావడంతో సూపర్ నోవాస్ రెండు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.  

click me!