పాక్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం... ఐపిఎల్ చలవే అంటున్న బెయిర్ స్టో

By Arun Kumar PFirst Published May 15, 2019, 2:27 PM IST
Highlights

ప్రపంచ కప్ కు ముందు పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. స్వదేశంలోని బ్రిస్టన్ వేదికగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించి  విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన   పాకిస్థాన్ జట్టుకు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (151 పరుగులు) సెంచరీతో చెలరేగి మంచి ఆరంభాన్నివ్వడంతో 358 పరుగులు భారీ స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.5 ఓవర్లలోనే చేధించింది. ఈ చేధనలో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో సెంచరీతో చెలరేగి ఇంగ్లాండ్ ను విజయతీరాలు చేర్చాడు. 

బెయిర్ స్టో ఈ మ్యాచ్ లో కేవలం 93 బంతుల్లోనే 128 పరుగులు చేశాడు. అతడికి తోడుగా  బరిలోకి దిగిన మరో ఓపెనర్ జాసన్ రాయ్ 55 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఇలా ఓపెనర్లిద్దరు వేగంగా పరుగులు సాధించడంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గింది. దీంతో వీరు ఔటైన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ ఆడుతు పాడుతు బ్యాటింగ్ చేసి 359 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు ఓవర్లు మిగిలుండగానే సునాయాసంగా చెధించారు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత సెంచరీ వీరుడు బెయిర్ స్టో మాట్లాడుతూ... తన ఆటతీరు మెరుగుపర్చుకోడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున వేర్వేరు జట్లకు చెందిన ఆటగాళ్లతో కలిగి ఆడటంతో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ జట్టులో సహచరుడు డేవిడ్ వార్నర్ ఆటతీరును చాలా  దగ్గరునుండి చూశానని గుర్తుచేశారు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లోనూ ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా ఎలా ఆడాలో అతడి నుండే నేర్చుకున్నానని బెయిర్ స్టో వెల్లడించాడు. 

click me!