వెస్టిండీస్ టీమ్ లోకి విధ్వంసకర ఆటగాడు..!

Published : Jul 20, 2023, 11:20 AM ISTUpdated : Jul 20, 2023, 04:30 PM IST
 వెస్టిండీస్ టీమ్ లోకి విధ్వంసకర ఆటగాడు..!

సారాంశం

మళ్లీ జట్టు లోకి అడుగుపెట్టాలని, వెస్టిండీస్  జెర్సీ ధరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం.


వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ మళ్లీ టీమ్ లోకి వచ్చేస్తున్నాడు.  చాలా కాలంగా రస్సెల్ తన టీమ్ కి దూరంగా ఉంటున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగానే ఆయన టీమ్ కి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మళ్లీ టీమ్ లో కి రానున్నాడు.

రస్సెల్ చివరగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్ తరపున ఆడాడు. ఆ తర్వాత నుంచి కేవలం ప్రాంఛైజీ లీగస్ లో మాత్రమే ఆడుతూ వచ్చాడు. అయితే, తాజాగా ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ జట్టు లోకి అడుగుపెట్టాలని, వెస్టిండీస్  జెర్సీ ధరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం.

‘నేను అందుబాటులో ఉన్నాను. నేను తదుపరి ప్రపంచ కప్‌లో భాగం కావాలనుకుంటున్నాను, తద్వారా వారు నన్ను జట్టులో చేర్చగలిగితే అది నాకు చాలా స్పెషల్ " అని రస్సెల్ పేర్కొన్నాడు.

"ప్రతిదీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు; వెస్టిండీస్‌కు ఆడాలంటే నేను రెండు లీగ్‌లను త్యాగం చేయాలని నాకు తెలుసు. నేను దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచ కప్‌లో వారికి అత్యుత్తమ అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తాను. నేను దేనికైనా సహకరించగలను.నేను దీన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను." అని చెప్పాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది
IND vs SA: హార్దిక్ హిట్ షో.. రీఎంట్రీలో సఫారీలకు చుక్కలు ! సిక్సర్ల కింగ్