ఫ్యాన్ మీట్ లో పాత ఫోటో చూసి రోహిత్ రియాక్షన్ ఇదే..!

Published : Jul 20, 2023, 09:28 AM IST
  ఫ్యాన్ మీట్ లో పాత ఫోటో చూసి రోహిత్ రియాక్షన్ ఇదే..!

సారాంశం

ఆ ఫోటో చూసిన రోహిత్, అందులో తనకు చాలా గడ్డం ఉంది అని కామెంట్ చేయడం విశేషం. ఆ ఫోటో 2017లో వెస్టిండీస్ టూర్ సందర్భంగా దిగిన ఫోటో కావడం విశేషం.

వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా.. వెస్టిండీస్ తో ఆడిన మొద‌టి టెస్ట్ మ్యాచ్‌లో 141 ప‌రుగుల తేడాతో ఇన్నింగ్స్ గెలిచింది. ఇక‌ జులై 20 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇప్పుడు రెండు జట్లు రెడీ అవుతున్నాయి.

కాగా, ఈ రెండో టెస్టుకు రెడీ అవుతున్న టీమిండియా ఆటగాళ్లు తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. తమ అభిమాన క్రికెటర్లతో ఫోటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. కాగా, ఈ వీడియో ని తాజాగా బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ప్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా, ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ అభిమానితో మాట్లాడుతూ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ లో ఓ అమ్మాయి రోహిత్ శర్మతో గతంలో దిగిన ఫోటోని తీసుకువచ్చి, దానిపై ఆటోగ్రాఫ్ చేయమని అడిగింది. ఆ ఫోటో చూసిన రోహిత్, అందులో తనకు చాలా గడ్డం ఉంది అని కామెంట్ చేయడం విశేషం. ఆ ఫోటో 2017లో వెస్టిండీస్ టూర్ సందర్భంగా దిగిన ఫోటో కావడం విశేషం.


 
కాగా, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి ముందు క్లీన్ షేవ్‌తో కనిపించాడు రోహిత్ శర్మ. వచ్చే వరల్డ్ కప్ వరకూ ఇదే లుక్ మెయింటైన్ చేయాలని రోహిత్ శర్మ ఫిక్స్ అయినట్టు అతని ఫ్యాన్స్ చెబుతున్నారు.. దీనికి ఓ బలమైన కారణమే ఉంది. ఇప్పటిదాకా వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లలో ఏ కెప్టెన్‌కి కూడా గడ్డం లేదు. 1975, 1979 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో వెస్టిండీస్‌ని విశ్వవిజేతగా నిలిచిన క్లెయివ్ లార్డ్ దగ్గర్నుంచి 2019 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇయాన్ మోర్గాన్ వరకూ అందరూ క్లీన్ షేన్‌తో బరిలో దిగిన కెప్టెన్లే టైటిల్స్ గెలిచారు. అందుకే రోహిత్ కూడా ఈ గడ్డం ఫార్ములా ఫాలో అవుతున్నాడంటూ వార్తలు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !