ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసిన జై షా... సెప్టెంబర్ 4న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్...

Published : Jul 19, 2023, 07:42 PM ISTUpdated : Jul 19, 2023, 07:56 PM IST
ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసిన జై షా... సెప్టెంబర్ 4న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్...

సారాంశం

ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్- నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం... సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు జరగబోయే ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్- నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం అవుతుంది. గ్రూప్ Aలో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు ఆసియా కప్ టోర్నీకి తొలిసారిగా అర్హత సాధించిన నేపాల్ పోటీపడుతోంది. గ్రూప్ Bలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీ పడబోతున్నాయి..

కెండీలో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు ఇండియా-  పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గ్రూప్ స్టేజీలో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 6 నుంచి సూపర్ 4 రౌండ్ మొదలవుతుంది. సెప్టెంబర్ 17న శ్రీలంకలోని రిపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది..
 

తొలిసారి ఆసియా కప్‌కి అర్హత సాధించిన నేపాల్, సంచలన విజయాలు సాధించకపోతే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందే రెండు మ్యాచులు చూడొచ్చు. సెప్టెంబర్ 4న కెండీలో గ్రూప్ మ్యాచ్‌ ఆడే ఇండియా- పాకిస్తాన్, సెప్టెంబర్ 10న కొలంబోలో సూపర్ 4 మ్యాచులు ఆడతాయి. ఒకవేళ ఈ రెండు జట్లు సూపర్ 4 రౌండ్‌లో టాప్ 2లో నిలిస్తే కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడొచ్చు.. 

ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ ఇదే:
ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్ vs నేపాల్ 
ఆగస్టు 31న కెండీలో బంగ్లాదేశ్ vs శ్రీలంక
సెప్టెంబర్ 2న కెండీలో ఇండియా vs పాకిస్తాన్
సెప్టెంబర్ 3న లాహోర్‌లో బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 4న కెండీలో ఇండియా vs నేపాల్
సెప్టెంబర్ 5న లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక

సూపర్ 4 రౌండ్ మ్యాచులు
సెప్టెంబర్ 6న A1 vs B2 (లాహోర్)
మొదటి మ్యాచ్ మినహా సూపర్ 4 రౌండ్‌లో మిగిలిన మ్యాచులన్నీ కొలంబోలో జరుగుతాయి.
సెప్టెంబర్ 9న B1 vs B2
సెప్టెంబర్ 10న A1 vs A2 
(నేపాల్ సంచలనం క్రియేట్ చేయకపోతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్)
సెప్టెంబర్ 12న A2 vs B1
సెప్టెంబర్ 14న A1 vs B1
సెప్టెంబర్ 15న A2 vs B2

సెప్టెంబర్ 17న కొలంబోలో ఫైనల్
 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !