అవినీతరుపరుడు, అహంకారి వల్ల అవినీతిరహితమైన ఆర్గనైజేషన్ మొత్తంపై అవినీతి ముద్ర పడుతుంది... వెంటనే ట్వీట్ డిలీట్ ేసిన వెంకటేశ్ ప్రసాద్! నెటిజన్ల రియాక్షన్‌తో మళ్లీ ఎడిట్ చేసి ట్వీట్ చేసిన వెంకటేశ్ ప్రసాద్..
కొన్నాళ్లుగా నిర్మొహమాటంగా, నిర్భయంగా టీమిండియా ఆటతీరును, బీసీసీఐ వ్యవహరశైలిని విమర్శిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సమయంలో శుబ్‌మన్ గిల్‌ని కాదని, కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు వెంకటేశ్ ప్రసాద్..
కెఎల్ రాహుల్‌కి సపోర్ట్ చేయడానికి ఆకాశ్ చోప్రా ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయిన వెంకటేశ్ ప్రసాద్, సెలక్టర్లను, టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును ఓ రేంజ్‌లో ట్రోల్ చేశాడు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే కేటాయించడాన్ని కూడా తప్పుబట్టిన వెంకటేశ్ ప్రసాద్, తాజాగా వేసిన ఓ ట్వీట్... సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది..
‘ఓ అవినీతరుపరుడు, అహంకారి అయిన ఒక్క వ్యక్తి వల్ల అవినీతిరహితమైన ఆర్గనైజేషన్ మొత్తంపై అవినీతి ముద్ర పడుతుంది. చిన్నగా కాదు, భారీ స్థాయిలో మొత్తం లీడర్‌షిప్ కూడా అవినీతిమయం అవుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...
ఈ ట్వీట్ ఎవరి గురించి వేసింది తెలియకపోయినా, వెంకటేశ్ ప్రసాద్ మాజీ క్రికెటర్ కావడంతో బీసీసీఐ సెక్రటరీ జై షా గురించే అతను ఈ ట్వీట్ వేశాడని చాలామంది కామెంట్లు చేశారు. తన ట్వీట్ వివాదాస్పదం కావడంతో ఈ ట్వీట్‌ని వెంటనే డిలీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్.
అయితే ట్వీట్ డిలీట్ చేశాడని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టడంతో కొన్ని మార్పులు, చేర్పులతో మరోసారి ఇదే ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. పాత ట్వీట్‌కి ‘ఇది క్రికెట్, రాజకీయాలు, జర్నలిజం, కార్పొరేట్.. ప్రతీ ఫీల్డ్‌లోనూ ఇలాగే జరుగుతుంది..’ అంటూ కొన్ని పదాలు జోడించి, మళ్లీ ట్వీట్ చేశాడు వెంకీ..
It takes one corrupt, arrogant guy to take away the hardwork of an otherwise non-corrupt organisation and spoil the reputation of an entire organisation & the impact isn’t just micro but at a macro level. This is true in every field, be it politics,sports, journalistm, corporate.
— Venkatesh Prasad (@venkateshprasad)అయినా జై సా గురించేనని చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతుండడంతో తన ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చాడు వెంకటేశ్ ప్రసాద్. ‘నేను కేవలం ఓ అవినీతిపరుడు, మంచిగా పనిచేస్తున్న న్యాయమైన సంస్థను ఎలా చెడగొడతాడో చెప్పాలని చేసిన సాధారణ ట్వీట్ ఇది.
అయితే నేను కొన్ని రోజులుగా బీసీసీఐ గురించి, వరల్డ్ కప్ టికెట్ల విక్రయం గురించి మాట్లాడుతుండడంతో అందరూ భారత క్రికెట్ బోర్డు గురించే అని పొరబడుతున్నారు. అందుకే డిలీట్ చేశా. అంతే కానీ ఎవరికీ భయపడి కాదు. నేను రామభక్తుడిని ఎవ్వరినీ వదలను. జై శ్రీరామ్’ అంటూ ఓ నెటిజన్‌కి రిప్లై ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...