గాయంతో ఆసీస్ టూర్‌కి దూరం... ఇంతలో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి...

Published : Dec 12, 2020, 07:23 PM IST
గాయంతో ఆసీస్ టూర్‌కి దూరం... ఇంతలో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి...

సారాంశం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి... ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ టూర్‌కి ఎంపికైన కేకేఆర్ స్పిన్నర్... ఆసీస్ బయలుదేరి వెళ్లేముందు జట్టు నుంచి తప్పుకున్న వరుణ్ చక్రవర్తి... వరుణ్ స్థానంలో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన సన్‌రైజర్స్ పేసర్ టి నటరాజన్...  

వరుణ్ చక్రవర్తి... ఐపీఎల్‌లో మెరిసిన ఈ యంగ్ స్పిన్నర్‌ను ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఇంతలో ఏమైందో ఏమో గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి స్థానంలో టి నటరాజన్‌కి చోటు దక్కింది. అనుకోకుండా జట్టులోకి వచ్చిన నటరాజన్, చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌లో అదరగొట్టి ఆస్ట్రేలియాకి షాక్ ఇస్తే... గాయంతో టూర్‌కి దూరమైన వరుణ్ చక్రవర్తి పెళ్లి చేసుకుని ఇండియన్స్‌కి షాక్ ఇచ్చాడు. 

తమిళనాడు రాష్ట్రానికి చెందిన వరుణ్ చక్రవర్తి, హీరో విజయ్‌కి వీరాభిమాని. విజయ్ మీద అభిమానంతో ఆయన పేరుని కూడా పచ్చబొట్టు వేసుకున్నాడు. ఐపీఎల్ తర్వాత తన ఫేవరెట్ హీరోని కలిసి ఫోటో దిగిన వరుణ్ చక్రవర్తి, డిసెంబర్ 11న పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

ఐపీఎల్ 2020లో 17 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి పెళ్లికి  కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన వరుణ్ చక్రవర్తి, నిజంగానే గాయంతోనే ఆసీస్ టూర్‌కి దూరంగా ఉన్నాడా? లేక పెళ్లి కోసమే గాయం సాకు చెప్పాడా? అని అనుమానిస్తూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు