ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయిన రోహిత్ శర్మ... చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియాకు...

Published : Dec 12, 2020, 03:20 PM IST
ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయిన రోహిత్ శర్మ... చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియాకు...

సారాంశం

నవంబర్ 19 నుంచి ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ... డిసెంబర్ 11న జరిపిన తుది ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ పాస్ అయినట్టు ప్రకటించిన బీసీసీఐ... త్వరలో ఆస్ట్రేలియాకు రోహిత్ శర్మ... ఆఖరి రెండు టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం...

టీమిండియా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అభిమానులకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ రాక గురించి కొన్నాళ్లు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వస్తాడో, రాడో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

‘రోహిత్ గాయం మిస్టరీగా మారిందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు తగ్గట్టుగానే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అతను ఆడతాడో లేదో అనే విషయమై తీవ్ర ఉత్కంఠభరిత డ్రామా జరిగింది. ఎట్టకేలకు ఈ డ్రామాకి తెరదింపింది బీసీసీఐ.

తండ్రి కోసం ఐపీఎల్ ముగిసిన తర్వాత దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ శర్మ... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయ్యాడు. నవంబర్ 19 నుంచి ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ, ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయినట్టు ప్రకటించింది బీసీసీఐ.

త్వరలో ఆస్ట్రేలియాకి బయలుదేరి వెళ్లనున్న రోహిత్ శర్మ, చివరి రెండు టెస్టులు ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియాలో రెండు వారాల పాటు క్వారంటైన్‌లో గడిపే రోహిత్ శర్మ, టీమిండియా మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ప్రాక్టీసులో పాల్గొంటాడని తెలిపాడు బీసీసీఐ గౌరవ సెక్రటరీ జే షా. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు