వరుణ్ చక్రవర్తిని మళ్లీ వెంటాడుతున్న బ్యాడ్‌లక్... ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్!

Published : Mar 01, 2021, 01:35 PM IST
వరుణ్ చక్రవర్తిని మళ్లీ వెంటాడుతున్న బ్యాడ్‌లక్... ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్!

సారాంశం

ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి ఫెయిల్... ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి...

వరుణ్ చక్రవర్తి... అందరూ భారత జట్టులో చోటు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూ, ‘ఒక్క ఛాన్స్’ రాకపోతుందా? అని ఎదురుచూస్తుంటే, ఇతను మాత్రం వచ్చిన అవకాశాలను చెడగొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికయ్యాడు.

కానీ సీజన్ ప్రారంభానికి ముందే గాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎంపికైన నటరాజన్, ఆసీస్ టూర్‌లో ఆకట్టకున్నాడు. గాయంతో ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లకపోయినా ఆ టైమ్‌ని కరెక్టుగా వాడుకున్న వరుణ్ చక్రవర్తి, పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి కూడా వరుణ్ చక్రవర్తికి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బీసీసీఐ నిర్వహించిన 2 కి.మీ. ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అయ్యాడట. కొత్త రూల్ ప్రకారం ఈ ఫిట్‌నెస్ పాస్ అయిన వారికే జట్టులో చోటు దక్కుతుంది. దీంతో ఈసారి కూడా వరుణ్ చక్రవర్తి, భారత జట్టుకి దూరమైనట్టే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !