రోహిత్ శర్మ ఫోటో.. ట్రోల్ చేసిన భార్య..!

Published : Mar 01, 2021, 09:32 AM ISTUpdated : Mar 01, 2021, 10:05 AM IST
రోహిత్ శర్మ ఫోటో.. ట్రోల్ చేసిన భార్య..!

సారాంశం

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న రోహిత్.. ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలో పచ్చికపై పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేశాడు

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ని.. ఆయన సొంత భార్య రితిక ట్రోల్ చేసింది. ఆయన సరదాగా ఓ ఫోటో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. కాగా.. ఆ ఫోటోని రితిక ట్రోల్ చేయడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న రోహిత్.. ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలో పచ్చికపై పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దానికి ‘పిచ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటో చూసిన రోహిత్ భార్య రితిక అతన్ని ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. ‘మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !