టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు... టాప్ 3లోకి దూసుకొచ్చిన అశ్విన్...

Published : Feb 28, 2021, 02:12 PM IST
టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు... టాప్ 3లోకి దూసుకొచ్చిన అశ్విన్...

సారాంశం

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి రోహిత్ శర్మ... టెస్టు బౌలర్ల ర్యాంకింగ్‌లో టాప్ 3 ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్... పదో స్థానానికి పడిపోయిన పూజారా, 9వ స్థానంలో బుమ్రా...

టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. రెండో టెస్టుల్లో అద్భుత సెంచరీతో పాటు మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 91 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానాన్ని సాధించాడు.

రెండు టెస్టుల పర్ఫామెన్స్ కారణంగా రోహిత్ ఏకంగా 6 ర్యాంకులు ఎగబాకడం విశేషం. 8వ ర్యాంకులో ఉన్న భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, రెండు ర్యాంకులు పడిపోయి 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. భారత సారథి విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో ఉన్నాడు.

 

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ టాప్‌లో ఉండగా స్టీవ్ స్మిత్, లబుషేన్, జో రూట్ వరుసగా టాప్ 4లో ఉన్నారు. పింక్ బాల్ టెస్టులో ఏడు వికెట్లు తీసిన అశ్విన్, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్యాట్ కమ్మిన్స్, నీల్ వాగ్నర్ టాప్ 2లో ఉండగా అండర్సన్ ఆరు, స్టువర్ట్ బ్రాడ్ ఏడో స్థానానికి పడిపోయారు. పింక్ బాల్ టెస్టులో వికెట్లు తీయలేకపోయిన బుమ్రా, ఒకస్థానం దిగజారి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?