T20 World Cup 2024 తొలి మ్యాచ్ లోనే కుమ్మేశారు.. ముందుముందు దబిడిదిబిడే.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 2, 2024, 4:27 PM IST

T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో తొలి మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టారు. అయితే, కెన‌డాపై అధిప‌త్యం చెలాయించిన అమెరికా  బోణీ కొట్టింది.
 


T20 World Cup 2024 : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ లో ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు ప‌రుగుల వ‌ర‌దపారించారు. రెండు కొత్త‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న జ‌ట్లు అయినప్పటికీ క్రికెట్ ల‌వ‌ర్స్ కు మంచి మ‌జాను అందించాయి. ఇరు జ‌ట్ల‌ల‌లోనే ప‌లువురు ప్లేయ‌ర్లు అద్భుత‌మైన షాట్లు ఆడారు. ఇదే స‌మ‌యంలో ప‌లువురు బౌల‌ర్లు సైతం మంచి బంతులు వేయ‌డం క‌నిపించింది. అయితే, అతిథ్య అమెరికా అద్భుత‌మైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అధిపత్యం ప్ర‌ద‌ర్శించి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లోలి విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ లో కెన‌డా 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. 195 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన అమెరికా జ‌ట్టు17.4 ఓవ‌ర్ల‌లో  197 ప‌రుగుల‌తో టార్గెట్ ను ఛేదించింది. దీంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో తొలి విజ‌యం అందుకున్న టీమ్ గా చ‌రిత్ర సృష్టించింది. అయితే, ఈ మ్యాచ్ లో అమెరికా ప్లేయ‌ర్ 4 ప‌రుగులు చేసి ఉంటే సెంచ‌రీ న‌మోదై ఉండేది.  ఆరోన్ జోన్స్ 94 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో కెన‌డా బౌలింగ్ ను చిత్తుచేశాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 4 పోర్లు, 10 సిక్స‌ర్లు బాదాడు. ఇందులో కొట్టిన కొన్ని ఫోర్లు, సిక్స‌ర్లు చాలా అద్భుత‌మైన షాట్లు అని చెప్పాలి. కేవ‌లం 22 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు.

Latest Videos

10 సిక్సర్లతో దుమ్మురేపిన జోన్స్.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 తొలి పోరులో కెన‌డాపై యూఎస్ఏ గెలుపు

అలాగే, మ‌రో అమెరికా ప్లేయ‌ర్ ఆండ్రీస్ గౌస్ కూడా సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. 65 ప‌రుగులు త‌న ఇన్నింగ్స్ తో 7 పోర్లు, 3 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక కెన‌డా ప్లేయ‌ర్లు కూడా అంత‌కుమందు మంచి స్ట్రైక్ రేటుతో భారీ స్కోర్ చేశారు. నవనీత్ ధలీవాల్ 44 బంతుల్లో 61 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ తో 6 ఫోర్లు, మూడు సిక్స‌ర్లు బాదాడు. అత‌ను కొట్టిన ఒక సిక్స‌ర్ అద‌రిపోయింది. అత‌నికి తోడుగా మ‌రో కెన‌డా ప్లేయ‌ర్ నికోలస్ కిర్టన్ 31 బంతుల్లో 51 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. క్రీజులో ఉన్నంత సేపు చాలా చ‌క్క‌టి షాట్స్ కొడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. శ్రేయాస్ మొవ్వా చిన్న ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికీ 16 బంతుల్లో 32 పరుగులతో సూప‌ర్ షాట్స్ ఆడాడు. ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు మొత్తంగా ఈ మ్యాచ్ లో 40 ఓవ‌ర్ల‌లోపే ఏకంగా 391 ప‌రుగులు కొట్టారు. ఇందులో 21 సిక్స‌ర్లు ఉన్నాయి.

T20 WORLD CUP 2024: భార‌త క్రికెట్ దిగ్గ‌జం గ‌వాస్క‌ర్ తో పాక్ కెప్టెన్ బాబార్ ఆజం.. ఏం చేస్తున్నారబ్బా?

click me!