T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 కు ముందు భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ను పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజం కలుసుకున్నారు. డల్లాస్ కు చేరుకునే ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు లండన్ విమానాశ్రయంలో గవాస్కర్ ను కలిశారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను కలుసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఉప్పొంగిపోయింది. సునీల్ గవాస్కర్ తో పాక్ కెప్టెన్ బాబార్ ఆజం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ టీమ్ తో సునీల్ గవాస్కర్ ఏం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే, ఈ సమావేశం ప్రణాళికాబద్ధంగా జరగలేదు. వాస్తవానికి, టీ20 ప్రపంచకప్ కోసం లండన్ నుండి యుఎస్ వెళ్లడానికి పాకిస్తాన్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు గవాస్కర్ కూడా అక్కడే ఉన్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ ప్రత్యేక క్షణానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. జూన్ 6న అమెరికాతో జరిగే ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ను ఆడనుంది. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ లో జూన్ 9న భారత్‌తో తలపడుతుంది. అయితే, లండన్ లో గవాస్కర్ క్వీన్స్ టెర్మినల్‌లోని లాంజ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ముచ్చటించారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో హాట్ హాట్ గా మాట్లాడుతున్నట్లు కనిపించారు.
T20 World Cup 2024 : రోహిత్ శర్మ ఫ్యాన్ ను చితకబాదిన యూఎస్ పోలీసులు.. హిట్‌మ్యాన్
Babar Azam interacts with cricketing icon Sunil Gavaskar 🤝🏏 pic.twitter.com/YZMRkDBXWV
— Pakistan Cricket (@TheRealPCB)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు లండన్ నుంచి బయలుదేరిన తర్వాత డల్లాస్ చేరుకున్న వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం షేర్ చేసింది. పాకిస్థాన్ బ్యాటింగ్ స్టార్‌ను తరచూ పొగిడే సునీల్ గవాస్కర్‌ను బాబర్ ఆజం కలవడం చాలా సంతోషంగా ఉందని వీడియోలో చూడవచ్చు. యుఎస్-కెనడా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ మ్యాచ్ వేదిక అయిన డల్లాస్‌కు పాకిస్తాన్ జట్టు చేరుకుంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జూన్ 6న పాకిస్థాన్, అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది.
10 సిక్సర్లతో దుమ్మురేపిన జోన్స్.. టీ20 వరల్డ్ కప్ 2024 తొలి పోరులో కెనడాపై యూఎస్ఏ గెలుపు