వరల్డ్‌కప్ ఆడిన అండర్-19 ప్లేయర్ ఆత్మహత్య... జట్టులో చోటు దక్కక మనస్థాపంతో...

Published : Nov 16, 2020, 04:47 PM IST
వరల్డ్‌కప్ ఆడిన అండర్-19 ప్లేయర్ ఆత్మహత్య... జట్టులో చోటు దక్కక మనస్థాపంతో...

సారాంశం

జట్టు చోటు దక్కలేదని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న బంగ్లా యువ క్రికెటర్... బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహిలో సంఘటన... ఆలస్యంగా వెలుగులోకి...  

సినిమాల్లో ఒక్క ఛాన్స్ రావాలంటే ఎంత కష్టమే, టాలెంట్ ఉన్నా తుదిజట్టులో చోటు దక్కించుకోవడమూ క్రికెటర్లకి అంతే కష్టం. తాజాగా తనకు క్రికెట్ టీమ్‌లో చోటు దక్కలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడో యువ క్రికెటర్.

బంగ్లాదేశ్‌కి చెందిన అండర్ 19 మాజీ క్రికెటర్ మహ్మద్ సోజిజ్ వయసు ప్రస్తుతం 21 ఏళ్లు...  2017లో అండర్ 19 ఆసియా కప్‌లో ఆడిన సోజిజ్, 2018 అండర్ 19 ప్రపంచకప్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే వరల్డ్‌కప్‌లో అతనికి అవకాశం దక్కలేదు. కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే పాల్గొన్నాడు సోజిజ్.

కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న సోజిజ్... బంగాబందు టీ20 టోర్నీలో తనకు కచ్ఛితంగా చోటు దక్కుతుందని నమ్మకంగా ఎదురుచూశాడు. అయితే తాజాగా ప్రకటించిన టీమ్‌లో మహ్మద్ సోజిజ్‌కి చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన క్రికెటర్.. రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని, ప్రాణాలు తీసుకున్నాడు.

అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !