ఆసీస్ టూర్‌లో నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన నటరాజన్... వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా...

Published : Nov 15, 2020, 05:39 PM ISTUpdated : Nov 15, 2020, 10:13 PM IST
ఆసీస్ టూర్‌లో నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన నటరాజన్... వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా...

సారాంశం

సీజన్‌లో ఏకంగా 80కి పైగా యార్కర్లు వేసి, అందర్నీ ఆశ్చర్యపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ టి. నటరాజన్... నటరాజన్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ... అతని పయనం అద్భుతమంటున్న వీవీఎస్ లక్ష్మణ్..

IPL 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మెరిసిన యార్కర్ కింగ్ నటరాజన్. తమిళనాడులో ఓ మారుమూల గ్రామం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్... సీజన్‌లో ఏకంగా 80కి పైగా యార్కర్లు వేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి సచిన్ టెండూల్కర్ వంటి వారికి కూడా ఆశ్చర్యపోయేలా చేశాడు నటరాజన్. గాయపడిన యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో ఆసీస్ టూర్‌కి ఎంపికైన టి. నటరాజన్... నెట్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.

నటరాజన్ బౌలింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ... ‘ఐపీఎల్‌లో ఇతను అద్భుతంగా బౌలింగ్ చేయడం చూశాం. ఇదిగో నటరాజన్ ఇప్పుడు టీమిండియాకి నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. కల నిజమైన క్షణమంటే ఇదే కదా... ’ అంటూ ట్వీట్ చేసింది.

దీనికి స్పందించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్... ‘ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ’ అంటూ ట్వీట్ చేశారు. భారత జట్టుకి ఎంపికైన నటరాజన్‌కి ఆసీస్ ప్లేయర్, సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. 

 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్