అండర్-19 ప్రపంచకప్: పాక్‌పై ఘనవిజయం, ఫైనల్లో భారత్

Siva Kodati |  
Published : Feb 04, 2020, 07:53 PM IST
అండర్-19 ప్రపంచకప్: పాక్‌పై ఘనవిజయం, ఫైనల్లో భారత్

సారాంశం

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ప్రవేశించింది. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ప్రవేశించింది. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది.

వైబీకే జైస్వాల్ 105, సక్సేనా 59 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. భారత బ్యాట్స్‌మెన్లపై పాకిస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. 

Also Read:కివీస్ పై వన్డే: కేఎల్ రాహుల్ కు తప్పని తలనొప్పి

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ కట్టడి చేశారు. ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ హురైరా‌ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫహాద్ మునీర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

అయితే ఓపెనర్ హైదర్ అలీ 56 తో కలిసి కెప్టెన్ రోహాలీ నజీర్ 62 ఆచితూచి ఆడుతూ అప్పుడప్పుడు ఫోర్లు కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను జైస్వాల్ విడగొట్టాడు.

Also Read:ఎంత ఫ్రస్టేషన్... బ్యాట్ నేలకేసి కొట్టిన వార్నర్ కుమార్తె, వీడియో వైరల్

56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హైదర్ అలీ రవి బిష్నోయికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే ఖాసిమ్ అక్రమ్ 9 రనౌటయ్యాడు. ఇక అక్కడి నుంచి పాక్ వికెట్ల పతనం ప్రారంభమైంది.

ఆటగాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కెప్టెన్ నజీర్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో ఎస్ఎస్ మిశ్రా 3, కార్తీక్ త్యాగి, రవి భిష్నోయి తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !