ఆర్సీబీ 200 మ్యాచ్.. డ్యాన్స్ అదరగొట్టిన విరాట్ కోహ్లీ

By telugu news teamFirst Published Oct 16, 2020, 11:00 AM IST
Highlights

షార్జా వేదికగా ఆర్సీబీ, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ల సందడిగా జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే విషయంలో అభిమానులు చాలా కంగారుపడిపోయారు. కానీ.. దుబాయి వేదికగా ఐపీఎల్ సందడి షురూ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఐపీఎల్ లో అన్ని జట్లు.. నేనా అంటే నువ్వా అన్నట్లు తలపడుతున్నాయి. కాగా.. ఈ ఐపీఎల్ లో టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును చేరుకున్నాడు.

గురువారం షార్జా వేదికగా ఆర్సీబీ, కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ కోహ్లీకి ఆర్సీబీ తరఫున 200వ గేమ్. 2008 ఐపీఎల్ వేలంలో కోహ్లీని ఆర్‌సీబీ తీసుకున్నది. అప్పటి నుంచి విరాట్ అదే జట్టుకు ఆడుతున్నాడు. ఇది ఐపీఎల్‌లో కోహ్లీకి ఆర్సీబీ తరపున 185 మ్యాచ్‌ కాగా.. చాంపియన్స్‌ లీగ్‌ టీ20 (సీఎల్‌టీ20) అదే ప్రాంఛైజీ తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. ఫలితంగా ఒక ఫ్రాంచైజీకి 200వ మ్యాచ్‌ ఆడుతున్న ఘనతను విరాట్ నమోదు చేశాడు.

 

ffs Kohli 😭😂 pic.twitter.com/rrdP48e8Tv

— Jatin (@LogicalBakwaas)

అయితే, మ్యాచుకు ముందు పిచ్‌ దగ్గరికొచ్చి పరిశీలించిన బెంగళూరు జట్టు కెప్టెన్‌.. అనంతరం అక్కడే గడ్డిలో డ్యాన్స్‌ చేస్తూ సహా క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. కోహ్లీ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజెన్లు కొత్త కొత్త కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. మైదానంలో గూఫీ స్టెప్పులేస్తూ నవ్వుతూ ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నిస్తుండగా అతడి సహచరులు చుట్టుముట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కొద్దిసేపటికే 6 లక్షలకు పైగా వ్యూస్‌.. 3 లక్షల లైకులు వచ్చాయి. 

click me!