RCB vs KXIP: కోహ్లీ ప్రయోగం ఫెయిల్... అయినా భారీ స్కోరు చేసిన ఆర్‌సీబీ...

By team teluguFirst Published Oct 15, 2020, 9:08 PM IST
Highlights

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్... బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న ఆర్‌సీబీ... 

మురుగన్ అశ్విన్‌, షమీకి రెండేసి వికెట్లు... మోరిస్, ఉదన మెరుపులు...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, 20 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్‌ను మురగన్ అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన కోహ్లీ సేన, టూ డౌన్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి బదులుగా సుందర్, దూబేలను ఆడించాడు.

ఈ వ్యూహం పెద్దగా కలిసి రాకపోవడంతో బెంగళూరు మధ్యఓవర్లలో పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు చేయగా, శివమ్ దూబే 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన ఏబీ డివిల్లియర్స్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 3 ఫోర్లతో 48 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా ఏబీడీ అవుట్ అయిన షమీ ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు.

ఆఖర్లో క్రిస్ మోరిస్, ఉదన మెరుపులు మెరిపించడంతో మంచి స్కోరు చేయగలిగింది ఆర్‌సీబీ. క్రిస్ మోరిస్ 8 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేయగా ఉదన 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో షమీ,మురుగన్ అశ్విన్‌లకి 2 వికెట్లు దక్కగా, జోర్డాన్‌, అర్ష్‌దీప్ సింగ్‌లకి తలా ఓ వికెట్ దక్కాయి.   

click me!