ఆ జోన్ నుంచి మాత్రం టీం ఇండియా బయటపడగలిగింది: విరాట్ కోహ్లీ

By Sandra Ashok KumarFirst Published Jan 21, 2020, 6:00 PM IST
Highlights

ఆడిన మూడు మ్యాచుల్లోనే టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసం రెండింతలయింది. గడిచిన ఐదారు నెలల్లో భారత క్రికెట్‌ చరిత్రలో  సరికొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయని అభిప్రాయపడ్డాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. 

 2020 ఏడాది ఆరంభ మ్యాచులోనే భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందింది. అయినప్పటికీ భారత్ లేచి నిలబడి తిరిగి పోరాడింది. తుదికంటా పోరాడి బీసెరిస్ విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ వాళ్ళ లెక్క సరిచేయడం ఒకెత్తయితే... భారత టీం లో వచ్చిన నూతన ఉత్తేజం వెలకట్టలేనిది. 

ఆడిన మూడు మ్యాచుల్లోనే టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసం రెండింతలయింది. గడిచిన ఐదారు నెలల్లో భారత క్రికెట్‌ చరిత్రలో  సరికొత్త కోణాలు ఆవిష్కృతమయ్యాయని అభిప్రాయపడ్డాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఆస్ట్రేలియాపై 2-1తో వన్డే సిరీస్‌ సాధించిన అనంతరం విరాట్‌ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ పరాజయం తర్వాత టీమ్‌ ఇండియా ఏయే అంశాలపైనా చర్చించిందో మీడియాతో పంచుకున్నాడు. 

also read టీమిండియా మంచి ఆటగాడిని తెచ్చింది.. ధోనికి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్

ప్రతిసారీ టాస్‌పై ఆధారపడుతూ, అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూడలేమని, జట్టుగా భారత్‌ లక్ష్య ఛేదన ఇష్టపడుతుంది కాబట్టి, టాస్‌ ఓడగానే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదనే నిశ్చయానికి మాత్రం వాచినట్టు తెలిపాడు. బలమైన ప్రదర్శనలతో మ్యాచ్‌ను నిలబెట్టుకోగలమనే విషయాన్నీ ఆనాడు అనుకున్నామని, ఈ ఐదారు నెలల్లో జట్టుగా అదే పని చేసి చూపెట్టమని అన్నాడు. జట్టు ప్లానింగ్ నుంచి టాస్‌ అనే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం మానేశామని అన్నాడు. 

ప్రత్యర్థి విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు అనుగుణంగా సిద్ధమయ్యామని ఆనందం వ్యక్తం చేసాడు. ఈ కొంత సమయంలో జట్టులో వచ్చిన మార్పు అదే అని అన్నాడు. టాస్‌ ఓడినా, ఆకట్టుకునే ప్రదర్శనలతో మ్యాచ్‌లు నెగ్గగలమనే నమ్మకం జట్టుగా తమకుండేదని, చివరి 6-8 నెలల్లో ఇదే ప్రూవ్ అయిందని అన్నాడు. 

యువ క్రికెటర్లు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవటం భారత క్రికెట్‌కు మంచి సంకేతం అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. గత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టుకన్నా... ఈ  పర్యటనకు వచ్చిన జట్టు బలమైనదని విరాట్ అభిప్రాయపడ్డాడు. ముంబయిలో పది వికెట్ల ఘోర పరాజయం తర్వాత వరుస రెండు మ్యాచుల్లో భారత్‌ నెగ్గిన విషయం తెలిసిందే.

also read టీమిండియాకు భారీ షాక్: కివీస్ తో సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం

బెంగళూర్‌ నిర్ణయాత్మక వన్డేలో శిఖర్‌ ధావన్‌ను ముందుగానే కోల్పోయామని, బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ తగ్గిపోయినా... సీనియర్లు జట్టులో ఉండటంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పు సులువైందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 

రాహుల్‌ నిష్క్రమించిన తర్వాత రోహిత్‌తో కలిసి నిర్మించిన భాగస్వామ్యం గతంలో కంటే భిన్నమైనదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.  సోమవారం ఉదయం న్యూజిలాండ్‌కు భారత జట్టు పయనమైంది. జనవరి 24 నుంచి ఆరంభమయ్యే కివీస్‌ టూర్‌లో ఐదు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.

click me!