టీమిండియా మంచి ఆటగాడిని తెచ్చింది.. ధోనికి ప్రత్యామ్నాయం అతడే: అక్తర్

By Siva Kodati  |  First Published Jan 21, 2020, 5:09 PM IST

బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన కాంట్రాక్ట్‌ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు లేకపోవడంతో మిస్టర్ కూల్ కెరీర్‌ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


బీసీసీఐ కొత్తగా విడుదల చేసిన కాంట్రాక్ట్‌ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరు లేకపోవడంతో మిస్టర్ కూల్ కెరీర్‌ ముగిసినట్లేనని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read:టీమిండియాకు భారీ షాక్: కివీస్ తో సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం

Latest Videos

undefined

ధోని ఆడే ఐదో స్థానానికి మనీశ్ పాండే న్యాయం చేయగలడని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టును అక్తర్ తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకున్నాడు.

ఇన్నాళ్లకు ధోనీ ఆడే ఐదో స్థానంలో టీమిండియా మేనేజ్‌మెంట్ సరైన ఆటగాడిని తీసుకొచ్చిందని.. తన దృష్టిలో మనీశ్ ఐదో స్థానంలో సరిగ్గా సరిపోతాడని షోయబ్ అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని అన్నాడు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనా ప్రశంసల జల్లు కురిపించాడు.

Also Read:విరాట్ కోహ్లీ చెంచాగా వ్యాఖ్యలు: ఆకాశ్ చోప్రా ఘాటు రిప్లై

కోహ్లీ మానసికంగా చాలా బలవంతుడని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మళ్లీ ఎలా పైకి రావాలో అతనికి బాగా తెలుసునని చెప్పాడు. కోహ్లీ, రాహుల్, ధావన్, శ్రేయస్ అయ్యర్ లాంటి మేటి క్రికెటర్లు ఉన్న టీమిండియాకు బెంగళూరు పిచ్‌పై 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద విషయం కాదని అక్తర్ అభివర్ణించాడు.

click me!