నన్ను కాపీ కొడుతున్నారా..? కోహ్లీ, రాహుల్ లకు చాహల్ పంచ్

Published : Jan 30, 2020, 08:38 AM IST
నన్ను కాపీ కొడుతున్నారా..? కోహ్లీ, రాహుల్ లకు చాహల్ పంచ్

సారాంశం

చాహల్ తమ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ పై పెద్ద పంచ్ వేశాడు. వాళ్లిద్దరూ తన బ్యాటింగ్ స్టైల్ ని కాపీ కొడుతున్నారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫోటో కూడా ట్వీట్ చేశాడు. కాగా... చాహల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా యువ క్రికెటర్ యుజువేంద్ర చాహల్... ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే మైక్ పట్టుకొని చాహల్ టీవీ అంటూ హంగామా చేస్తుంటాడు. అతను చేసే సరదా ఇంటర్వ్యూలు అందరి చేత నవ్వులు పూయిస్తూ ఉంటాయి. 

తాజాగా... చాహల్ తమ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ పై పెద్ద పంచ్ వేశాడు. వాళ్లిద్దరూ తన బ్యాటింగ్ స్టైల్ ని కాపీ కొడుతున్నారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫోటో కూడా ట్వీట్ చేశాడు. కాగా... చాహల్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Also Read ఇండియా సూపర్ విన్: విలియమ్సన్ తీవ్ర అసహనం...

ఇంతకీ ఏమ్యాటరేంటంటే..బౌలింగ్ లో తన ప్రతిభతో ప్రత్యర్థి ఆట కట్టించడంలో చాహల్ దిట్ట. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే... బ్యాటింగ్ విషయంలో కూడా తాను గ్రేట్ అని.. తనని చూసి కోహ్లీ, రాహుల్ లు కాపీ కొడుతున్నారని సరదగా వ్యాక్యానించాడు.

తాజాగా తన ట్విట్టర్ లో చాహల్ ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో చాహల్ ఓ బ్యాట్ పట్టుకొని అప్పర్ కట్ చేస్తున్నట్లు గా ఉంది. అందే ఫోటోలో కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు సైతం అప్పర్ కట్ షాట్లు బాదుతున్నట్లుగా ఉంది. దానికి క్యాప్షన్ గా ..‘ వాళ్లు నా షాట్ కాపీ కొట్టాలని చూస్తున్నారు. పర్వాలేదు.. కీపిట్ అప్ యంగ్ స్టర్స్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమిండియా  న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.న్యూజిలాండ్ గడ్డపై జరిగిన టీ20 సిరీస్ ని ఇప్పటికే టీమిండియా కైవసం చేసుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !