తిలక్ వర్మ మెరుపులు వృథా... మొదటి టీ20లో చేజేతులా ఓడిన టీమిండియా...

Published : Aug 03, 2023, 11:52 PM IST
తిలక్ వర్మ మెరుపులు వృథా... మొదటి టీ20లో చేజేతులా ఓడిన టీమిండియా...

సారాంశం

150 పరుగుల లక్ష్యఛేదనలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసిన టీమిండియా... ఆఖరి ఓవర్ వరకూ సాగిన థ్రిల్లర్‌లో 4 పరుగుల తేడాతో ఓటమి...

150 పరుగుల స్వల్ప టార్గెట్. ఐసీసీ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ ఉండడంతో టీమిండియా ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. 30 బంతుల్లో 37 పరుగులు మాత్రమే కావాల్సిన స్థితి నుంచి వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

150 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 9 బంతులు ఆడి 3 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ, మొదటి బంతిని డాట్ బాల్‌గా ఆడినా ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు..

22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా,జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన సంజూ శాంసన్, కైల్ మేయర్స్ కొట్టిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. 30 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో 16వ ఓవర్ వేసిన జాసన్ హోల్డర్, హార్ధిక్ పాండ్యా వికెట్‌తో పాటు మెయిడిన్ ఓవర్ వేశాడు..

దీంతో 24 బంతుల్లో 37 పరుగులు కావాల్సి వచ్చాయి. 17వ ఓవర్‌లో 5 పరుగులు రాగా, 18వ ఓవర్‌లో అక్షర్ పటేల్ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 19వ ఓవర్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించి, అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. 13 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా విజయానికి 11 బంతుల్లో 21 పరుగులు కావాలి..

అర్ష్‌దీప్ సింగ్ వస్తూనే రెండు ఫోర్లు బాదాడు. 19వ ఓవర్‌లో 11 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి ఓవర్ మొదటి బంతికి కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో బంతికి చాహాల్ సింగిల్ తీయగా రెండో బంతికి అర్ష్‌దీప్ సింగ్ 2 పరుగులు తీశాడు. 

నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో రెండో పరుగు కోసం ప్రయత్నించి అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. చివరి బంతిని ఎదుర్కొన్న ముకేశ్ కుమార్ సింగిల్ మాత్రమే తీయడంతో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడింది. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. 7 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేసిన కైల్ మేయర్స్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ కూడా యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

6 బంతుల్లో 3 పరుగులు చేసిన జాన్సన్ ఛార్లెస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి తిలక్ వర్మ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్, అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !