బుట్ట బొమ్మ పాటకు క్రికెటర్ల స్టెప్పులు: మొన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కెవిన్ పీటర్సన్

Siva Kodati |  
Published : May 13, 2020, 03:20 PM ISTUpdated : May 13, 2020, 03:23 PM IST
బుట్ట బొమ్మ పాటకు క్రికెటర్ల స్టెప్పులు: మొన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కెవిన్ పీటర్సన్

సారాంశం

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో వచ్చిన అల... వైకుంఠపురం మూవీలో తమన్ అందించిన పాటలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదాపడటమో, రద్దవ్వడమో జరిగింది. ఇందుకు క్రికెట్ కూడా మినహాయింపు కాదు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్‌తో గడిపే క్రికెటర్లు ఈ లాక్‌డౌన్ సమయంలో కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు.

Also Read:అక్కడ ధోనీది కాదు.. సాక్షి మాటే శాసనం: పెంపుడు కుక్కతో మిస్టర్ కూల్ ఆటలు

ఈ క్రమంలో పలువురు విదేశీ క్రికెటర్లను మన తెలుగు సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో వచ్చిన అల... వైకుంఠపురం మూవీలో తమన్ అందించిన పాటలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటకు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ దంపతులు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:అందాలు ఆరబోస్తూ డ్యాన్స్... ట్రోల్స్ కి షమీ భార్య ఘాటు రిప్లై

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఇంగ్లాండ్ మాజీ సారథి, క్రికెట్ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్‌ కూడా చేరాడు. ఈ పాటకు ముగ్ధుడైన కెవిన్ టిక్ టాక్ వీడియో చేసి.. హుక్ స్టెప్పుడు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు