కోహ్లీ కూతురిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు! హైదరాబాదీపై కేసు కొట్టేసిన బాంబే హైకోర్టు...

Published : Apr 11, 2023, 04:43 PM IST
కోహ్లీ కూతురిని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు! హైదరాబాదీపై కేసు కొట్టేసిన బాంబే హైకోర్టు...

సారాంశం

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా... కోహ్లీతో పాటు అతని కుటుంబాన్ని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఏడాదిన్నర తర్వాత కేసు కొట్టేసిన బాంబే హై కోర్టు..

ఐపీఎల్ కారణంగా మంచి ఎంత జరిగిందో, చెడు కూడా అంతే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు, గాయపడుతూ జాతీయ జట్లకి దూరమవుతున్నారు. అలాగే క్రికెటర్లు బాగా ఆడకపోతే వారి కుటుంబాలను టార్గెట్ చేస్తూ తిట్టడం కూడా ఐపీఎల్ వల్ల చాలా పెరిగింది..

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. ఈ సమయంలో ధోనీ బాగా ఆడడం లేదని, ఆయన నాలుగేళ్ల కూతురిని తిడుతూ సోషల్ మీడియాలోపోస్టులు, బెదిరింపులు ప్రత్యక్షం అయ్యాయి. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం క్రియేట్ చేసింది..

 2021లో జన్మించిన విరాట్ కోహ్లీ కూతురు వామిక కోహ్లీకి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2021 జనవరిలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు వామిక కోహ్లీ జన్మించింది. అదే ఏడాది నవంబర్‌లో యూఏఈలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడింది టీమిండియా...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియా ఓడిపోవడం అదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించినా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో టీమ్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు...

ఈ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీని, అతని కుటుంబాన్ని తిడుతూ సైబర్ దాడి జరిగింది. హైదరాబాద్‌కి చెందిన ఆకుబత్తిని రామ్‌ నాగేశ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, విరాట్ కోహ్లీ కూతురు వామిక కోహ్లీ తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఈ విషయం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దృష్టికి కూడా వచ్చింది. దీంతో విరాట్ కోహ్లీ మేనేజర్ అక్విలియా డి సౌజా, పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు,, రామ్ నాగేశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది అప్పటి ధర్మాసనం తీర్పు నిచ్చింది. అయితే తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టేయాలంటూ ఈ ఏడాది ఫ్రిబవరిలో బాంబే హైకోర్టును ఆశ్రయించాడు...

తాను JEE (advanced) పరీక్షలో టాప్ ర్యాంకు తెచ్చుకున్నానని, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థిని అని, ఇలా క్రిమినల్ కేసు పెట్టడం వల్ల తన భవిష్యత్తు పాడవుతుందని తన ఫిటిషన్‌లో పేర్కొన్నాడు రామ్ నాగేశ్. విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్న తనకు ఈ ఎఫ్‌ఐఆర్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టుని కోరాడు..

దీంతో అతనిపై సానుభూతి చూపిన బాంబే హైకోర్టు, అతనిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టేయాల్సిందిగా పోలీసులకు సూచించింది. ట్విట్టర్‌లో వామిక కోహ్లీని తిడుతూ, చంపేస్తానని బెదిరిస్తూ చేసిన ట్వీట్లు, అతని ఐపీ అడ్రెస్ నుంచి చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రామ్ నాగేశ్ ఈ పోస్టులు చేశాడని సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సమర్పించలేకపోయారని తెలిపింది.. 

2021, నవంబర్ 8న రామ్ నాగేశ్‌పై ఐపీసీ సెక్షన్ 354, 506, 500, 201 చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, నవంబర్ 16 వరకూ పోలీసుల అదుపులో ఉంచారు. ఆ తర్వాత నవంబర్ 21న అతనికి బెయిల్ వచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !