అన్ని ఫ్రాంచైజీలపైనా హాఫ్ సెంచరీ.. కోహ్లీ పేరిట మరో అరుదైన ఘనత..

Published : Apr 10, 2023, 09:59 PM IST
అన్ని ఫ్రాంచైజీలపైనా హాఫ్ సెంచరీ..  కోహ్లీ పేరిట మరో అరుదైన ఘనత..

సారాంశం

Virat Kohli: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  ఐపీఎల్ లో  మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. లక్నోతో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో  హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అతడు ఈ ఘనతను సాధించాడు. 

రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  పరుగుల దాహం తీరడం లేదు. వయసు మీద పడుతున్నా కోహ్లీ ఇంకా రాటుదేలుతున్నాడు. ఈ సీజన్ లో  స్వంత గ్రౌండ్ లో చెలరేగి ఆడుతున్నాడు.  ముంబై ఇండియన్స్ తో  తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో చెలరేగిన  కోహ్లీ.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో కూడా  మరో అర్థ సెంచరీ సాధించాడు.  తద్వారా కోహ్లీ  ఐపీఎల్ మరెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకున్నాడు. 

లక్నోపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. ఐపీఎల్ లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు   కోహ్లీ..  లక్నోతో మినహా మిగిలిన 8 ఫ్రాంచైజీలపై  అర్థ సెంచరీలు చేశాడు. 

ఈ మ్యాచ్ లో  34 బంతుల్లో హాఫ్ సెంచరీ   పూర్తి చేసిన  కోహ్లీ.. మొత్తంగా  44 బంతుల్లో 4 బౌండరీలు, 4 సిక్సర్లతో   61 పరుగులు చేశాడు.  ప్రస్తుతం ఉన్న టీమ్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్ లో ఒక్క కొచ్చి టస్కర్స్ పై తప్ప  ఇంతవరకు ఉన్న దాదాపు అన్ని ఫ్రాంచైజీలపైనా కోహ్లీ అర్థ సెంచరీలు చేశాడు. చెన్నై, రాజస్తాన్ లు నిషేధం ఎదుర్కున్నప్పుడు వాటి స్థానంలో వచ్చిన పూణె సూపర్  జెయింట్స్, గుజరాత్ టైగర్స్ మీద కూడా కోహ్లీ  50 ప్లస్ స్కోర్లు చేశాడు.   ఈ క్రమంలో  ప్రస్తుతం యాక్టివ్ ఐపీఎల్ టీమ్స్ పై కోహ్లీ హయ్యస్ట్ స్కోర్లు చూద్దాం.

9 టీమ్స్ పై కోహ్లీ హయ్యస్ట్ స్కోర్లు : 

- సీఎస్కే - 90 నాటౌట్ 
-  ఢిల్లీ -  99 
- గుజరాత్ - 73 
- కోల్కతా  - 100 
- ముంబై - 92 నాటౌట్ 
- పంజాబ్ - 113 
- రాజస్తాన్ - 72 నాటౌట్ 
- హైదరాబాద్ - 93 నాటౌట్ 
- లక్నో - 61 

 

ఐపీఎల్ యాక్టివ్ టీమ్స్ తో  పాటు  కోహ్లీ   లక్నోతో మ్యాచ్ ద్వారా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.  టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కోహ్లీ.. ఆరోన్ ఫించ్   ను దాటేశాడు.  ఆ జాబితా ఇది.. 

టీ20లలో అత్యధిక పరుగులు :

- క్రిస్ గేల్ -  14,562 
- షోయభ్ మాలిక్ - 12,528 
- కీరన్ పొలార్డ్ - 12,175 
- విరాట్ కోహ్లీ  - 11,429 
- ఆరోన్ ఫించ్ - 11,392  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !