రోహిత్ శర్మ, టీమ్‌ కోసం ఆ ప్లేస్‌లో ఆడాడు! షకీబ్ అల్ హసన్, తమీమ్ మధ్య గొడవకు కారణం ఇదే..

By Chinthakindhi Ramu  |  First Published Sep 28, 2023, 3:34 PM IST

లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని చెప్పడం వల్లే, వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన తమీమ్ ఇక్బాల్.. అలా చేస్తే తప్పేంటంటూ ప్రశ్నించిన షకీబ్ అల్ హసన్.. 


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు బంగ్లా క్రికెట్ టీమ్‌లో ముసలం రేగింది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్, బంగ్లా ప్రధాని కోరడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే ప్రపంచ కప్ టీమ్‌లో అతనికి చోటు దక్కకపోవడంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఫలితం లేకుండా పోయింది..

కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కారణంగానే తమీమ్ ఇక్బాల్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పుకున్నట్టు సమచారం. ‘బోర్డులోని కొందరు పెద్దలు నాకు ఫోన్ చేసి, వరల్డ్ కప్ ఆడాలనుకుంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అది విని నేను షాక్ అయ్యా. నా 17 ఏళ్ల కెరీర్‌లో నేనెప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో కింద బ్యాటింగ్ చేయలేదు..’ అంటూ కామెంట్ చేశాడు తమీమ్ ఇక్బాల్..

Latest Videos

undefined


తాజాగా ఈ విషయంపై షకీబ్ అల్ హసక్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ విషయాన్ని ఎవరు చెప్పారో వారికి క్లారిటీ ఇస్తున్నా. ఇది టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం. టీమ్ కాంబినేషన్ కోసం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమీమ్‌కి ఎవరైనా టీమ్ కోసం నువ్వు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని చెబితే, అందులో తప్పేంటి?

నీకు నచ్చినట్టు నువ్వు చెయ్? అని చెప్పడమే కరెక్టా? టీమ్ ముఖ్యమా? ప్లేయర్ ముఖ్యమా? రోహిత్ శర్మ తన కెరీర్ ఆరంభంలో నెం.7లో బ్యాటింగ్ చేశాడు. 10 వేలకు పైగా పరుగులు చేశాడు. తమీమ్ ఇక్బాల్ ఇప్పుడు నెం.3 లేదా నెం.4 లో బ్యాటింగ్ చేస్తే అదేమైనా పెద్ద సమస్యా?

ఇది మరీ మూర్ఖత్వం. నా బ్యాటుతో నేను ఆడతా. నా స్థానంలో వేరే ఎవ్వరూ బ్యాటింగ్ చేయరు. టీమ్ కోసం ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. టీమే ప్రధానం. నువ్వు ఓపెనర్‌గా వచ్చి 100-200 చేసి, టీమ్ ఓడిపోతే ఏం లాభం.. వ్యక్తిగత అఛీవ్‌మెంట్ పెద్దవి కావు.. ’ అంటూ కామెంట్ చేశాడు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ షకీబ్ అల్ హసన్..

2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో బంగ్లాదేశ్‌కి కెప్టెన్సీ చేసిన షకీబ్ అల్ హసన్, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలోనూ బంగ్లాకి సారథిగా వ్యవహరించబోతున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌ ఆడి, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న ప్లేయర్లలో షకీబ్ ఒక్కడే అప్పుడు, ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్నాడు.. 

click me!