రోహిత్ శర్మలో అస్సలు నచ్చని విషయం గోర్లు కొరుక్కోవడమేనంటూ కామెంట్ చేసిన రోహిత్ శర్మ... సమైరా మానేసినా రోహిత్ శర్మ మానలేదంటూ..
గోర్లు కొరకడం చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్ చెప్పే ఉంటుంది. అయితే చాలామందికి ఇప్పటికీ కాస్త టెన్షన్‌గా ఉంటే, గోర్లు కొరకడం అలవాటు. టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇలా డగౌట్‌లో కూర్చొని గోర్లు కొరుక్కోవడం కనిపించింది.
తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం రాజ్‌కోట్ చేరుకున్నాడు రోహిత్ శర్మ. మొదటి రెండు వన్డేల నుంచి రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ, కుటుంబంతో గడిపాడు. రోహిత్, మూడో వన్డే కోసం రాజ్‌కోట్‌కి వెళ్లే సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్ వచ్చిన రితికా, అతనికి హగ్ ఇచ్చి సాగనంపింది..
undefined
ఈ ఇద్దరికీ సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నాకు రోహిత్ శర్మలో నచ్చే బెస్ట్ క్వాలిటీ, అతను అందరినీ ప్రేమిస్తాడు. తనకు నచ్చినట్టుగా ఉంటాడు. అతను ఎవరు ఎలా ఉన్నా, అతను మాత్రం ప్రేమిస్తాడు. తను ప్రేమిస్తే, ఆ విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది...’ అంటూ చెప్పుకొచ్చింది రితికా..
‘నాకు అతనిలో అస్సలు నచ్చని విషయం... గోర్లు కొరుక్కోవడం. ఆ అలవాటు మార్చుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా వినడు. అదో అలవాటు. సమ్మీ (రోహిత్ కూతురు సమైరా) కూడా గోర్లు కొరుక్కోవడం ఆపేసింది. ఇతను మాత్రం ఇప్పటికీ మారలేదు.. అసలు ఎందుకు ఎప్పుడూ గోర్లు కొరుక్కుంటాడా? అర్థం కాదు..’ అంటూ కామెంట్ చేసింది రితికా శర్మ..
దానికి రోహిత్ శర్మ తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు. ‘కెప్టెన్సీ ప్రెషర్ ఎలా ఉంటుందో ఈమెకేమి తెలుసు...’ అంటూ నవ్వేశాడు రోహిత్ శర్మ.
2021 నవంబర్‌లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత వన్డే కెప్టెన్‌గానూ ప్రమోషన్ దక్కించుకున్నాడు. చెప్పా పెట్టకుండా బీసీసీఐ, విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో మనస్థాపం చెందిన విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు..
35 ఏళ్ల లేటు వయసులో టీమిండియాకి త్రీ ఫార్మాట్ కెప్టెన్ అయ్యాడు రోహిత్ శర్మ. అయితే వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా 2022 టీ20 వరల్డ్ కప్ ముందు వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్ ముందు టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు..
కెప్టెన్‌గా 2023 వన్డే వరల్డ్ కప్ విజయం, రోహిత్ శర్మ కెరీర్‌కి చాలా కీలకం. ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ గెలవకపోతే, రోహిత్ శర్మ, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.