ఐపీఎల్ స్పెషాలిటీ అదే, ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అయినా సరే... మురళీధరన్ కామెంట్స్...

By Chinthakindhi RamuFirst Published Sep 18, 2021, 3:33 PM IST
Highlights

వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అయినా, ఐపీఎల్‌లో తుదిజట్టులో చోటు కోసం వెయిట్ చేయాల్సిందే... సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శ్రీలంక మాజీ లెజెండరీ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, ఐపీఎల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు...

‘ఐపీఎల్ బ్యూటీ ఇదే. మీరు ప్రపంచంలో బెస్ట్ క్రికెటర్ కావచ్చు, మీకు మీ జాతీయ జట్టులో తప్పకుండా చోటు ఉండొచ్చు. అయితే ఐపీఎల్‌ విషయానికి వస్తే, తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది... బహుశా ప్రపంచంలో మిగిలిన ఏ లీగ్‌లోనూ ఇలాంటి పోటీ ఉండదేమో...’ అంటూ కామెంట్ చేశాడు ముత్తయ్య మురళీధరన్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి తుది జట్టులో చోటు ఉంటుందా? ఉండదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే చాలాసార్లు డేవిడ్ వార్నర్ ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేశాడు.

ఒకానొక దశలో ‘ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం అంత దూరం వెళ్లినా, ఆడించరు.. డగౌట్‌లో కూర్చొని మ్యాచ్ చూడాలి... అదేదో ఇక్కడి నుంచే ప్రోత్సాహిస్తా...’ అంటూ నిరాశగా వ్యాఖ్యానించాడు వార్నర్..

ప్రస్తుతం ముత్తయ్య మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు, డేవిడ్ వార్నర్‌కి జట్టులో ప్లేస్ గురించేనని స్పష్టంగా తెలుస్తోంది. సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో పాల్గొనడం లేదని ప్రకటించినా... జాసన్ రాయ్, రూథర్డ్ ఫర్ట్ వంటి ప్లేయర్లు అందుబాటులో ఉండడంతో వార్నర్ భాయ్‌కి తుదిజట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు...

click me!