బంగ్లాదేశ్ తోనూ మేమే ఆడాలా? సెకండ్ టీమ్ తో ఆడుకోండి.. మేం ఐపీఎల్ ఆడతాం.. దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన క్రికెటర్లు

Published : Mar 18, 2022, 01:11 PM ISTUpdated : Mar 18, 2022, 01:13 PM IST
బంగ్లాదేశ్ తోనూ మేమే ఆడాలా? సెకండ్ టీమ్ తో ఆడుకోండి.. మేం ఐపీఎల్ ఆడతాం.. దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన క్రికెటర్లు

సారాంశం

SA Players Choose IPL Over National Duty: కోట్లు కురిపించే  లీగ్ ముందు జాతీయ జట్టు బాధ్యతలు ఎంత అనుకుంటున్నారు దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. ఐపీఎల్ కోసం స్వదేశంలో  దేశం కోసం ఆడాల్సిన మ్యాచులను సైతం వదిలి...  

తల్లా.. పెళ్లామా..? అంటే పెళ్లమే కావాలంటున్నారు దక్షిణాఫ్రికా క్రికెటర్లు. కాసులు కురిపిస్తున్న క్యాష్ రిచ్ లీగ్ కోసం  తమ జాతీయ జట్టు బాధ్యతలను కూడా వదులుకున్నారు.   తమకు జాతీయ జట్టు కంటే ఐపీఎలే ముఖ్యమని, చిన్నజట్టుతో కూడా తామే ఆడాలా..? అని న్యూఢిల్లీ విమానాలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.  త్వరలో  బంగ్లాదేశ్ తో  స్వదేశంలో జరిగే రెండు టెస్టుల సిరీస్ ను వద్దనుకుని మరి  ఐపీఎల్ లో తమను కోట్లు పోసి దక్కించుకున్న జట్లతో చేరేందుకు  రెడీ అవుతున్నారు. బంగ్లాదేశ్ తో  జరిగే టెస్టు సిరీస్ కు  ఆ జట్టు కీలక ఆటగాళ్లైన కగిసొ రబాడా, లుంగి ఎంగిడి,  మార్కో జాన్సేన్  లు డుమ్మా కొట్టారు. 

ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సమరానికే తమ ఓటు అన్నారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు. తమ దేశంలో బంగ్లాదేశ్ తో జరుగబోయే  రెండు మ్యాచుల  టెస్టులను కాదనుకుని  భారత్ కు బయల్దేరడానికి సిద్ధమయ్యారు.  ఆటగాళ్ల నిర్ణయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)  తీవ్ర  ఆందోళన వ్యక్తం చేసింది.

 

బంగ్లాదేశ్ తో సిరీస్ ను కాదనుకుని భారత్  లో ఐపీఎల్ కు వస్తున్న ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దాం.   కగిసొ రబాడా  (పంజాబ్ కింగ్స్), మార్కో జాన్సేన్ (సన్ రైజర్స్ హైదరాబాద్),  లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్)  లు ఐపీఎల్ లో తమ జట్లతో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ ముగ్గురూ దక్షిణాఫ్రికాకు కీలక బౌలర్లే కావడం గమనార్హం. ఇక వీరితో పాటు మార్క్రమ్ (సన్ రైజర్స్)  వాన్ డర్ డసెన్ (రాజస్థాన్ రాయల్స్)  కూడా  సీఎస్ఏ కు హ్యాండ్ ఇచ్చారు. 

ఇక గతంలో ఐపీఎల్-14 సీజన్ సందర్భంగా గాయపడి టీ20 ప్రపంచకప్ తో పాటు స్వదేశంలో భారత పర్యటనకు కూడా దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆన్రిచ్ నార్త్జ్ కూడా  బంగ్లాతో టెస్టులకు దూరంగా ఉన్నాడు.  అయితే అతడు ఐపీఎల్  లో ఆడతాడా..? లేదా..? అనేది అనుమానంగా ఉంది. ఇక ఇటీవలే టెస్టులకు గుడ్ బై చెప్పిన వికెట్ కీపర్ బ్యాటర్  క్వింటన్ డికాక్ కూడా ఐపీఎల్ కే ఓటేశాడు. అతడు ఈ సీజన్ లో లక్నో తరఫున ఆడనున్నాడు.  

డీన్ ఎల్గర్ నమ్మకం బుగ్గిపాలు :  

దక్షిణాఫ్రికా ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.  భారత్ ను స్వదేశంలో 2-1తో ఓడించిన  సఫారీలు.. న్యూజిలాండ్ లో కివీస్ తో రెండు మ్యాచుల సిరీస్ ను 1-1తో సమం చేశారు. ఈ సందర్భంగా డీన్ ఎల్గర్ తమ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడతారా..? లేక జాతీయ జట్టు బాధ్యతలను నిర్వర్తిస్తారా..? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘అది వారి  నిబద్ధతకు సంబంధించిన విషయం.  జాతీయ జట్టు, ఐపీఎల్ అనేది వాళ్లు నిర్ణయించుకోవాలి. అయితే మా ఆటగాళ్లు మాత్రం జట్టుకోసమే పనిచేస్తారని ఆశిస్తున్నా...’ అని చెప్పాడు. అయితే ఎల్గర్ నమ్మకాన్ని పైన పేర్కొన్న ఆటగాళ్లంతా వమ్ము చేయడం గమనార్హం. 

 

 
దక్షిణాఫ్రికా లో బంగ్లాదేశ్ పర్యటన నేటి (శుక్రవారం) తో ప్రారంభం కానుంది. మార్చి 18, 20, 23 న మూడు వన్డేలు ఆడనున్న బంగ్లా.. ఆ తర్వాత మార్చి 31 నుంచి రెండు టెస్టులు ఆడుతుంది. అందులో ఒకటి మార్చి 31 నుంచి  ప్రారంభమవుతుండగా..  రెండో టెస్టు ఏప్రిల్ 8 నుంచి మొదలవుతుంది.  పైన పేర్కొన్న ఆటగాళ్లెవరూ లేకుండానే దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతుంది. 

బంగ్లాతో  మ్యాచులకు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు : 

డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబ బవుమా,  డారిన్ డుపవిలన్, సరెల్ ఎర్వీ, సిమన్ హర్మర్, కేశవ్ మహారాజ్, వియాన్ మల్డర్,  ఒలివిర్, కీగన్ పీటర్సన్, రియాన్ రికెల్టన్, లుతొ సిపమ్ల, గ్లెంటన్ స్టర్మన్, కైల్ వెరియన్, లిజాడ్ విలియమ్స్, ఖయ జొండొ 

PREV
click me!

Recommended Stories

చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?